నువ్వు వస్తావని సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?
Nuvvu Vastavani Movie : వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న హీరో నాగార్జునకు నువ్వొస్తావని మూవీ మంచి ఊరట నిచ్చింది. బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ మూవీ సమయంలో మిగతా హీరోల సినిమాలు కూడా రిలీజయ్యాయి. అయినా సరే,నువ్వు వస్తావని విజయాన్ని ఆపలేకపోయాయి. 2000 ఏప్రియల్5న రిలీజైన ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్. సింగర్ గా రాణించాలనుకునే సిమ్రాన్ కి అండగా ఉంటూనే, మరోపక్క ఆమె నుంచి అసహ్యహించుకునే వ్యక్తిగా నాగ్ నటన సూపర్భ్. ఎస్ ఏ రాజ్ కుమార్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ఎసెట్. అందుకే మ్యూజికల్ గా ప్రభంజనం సృష్టించింది.
దాదాపు 15కోట్ల షేర్ రాబట్టిన నువ్వు వస్తావని మూవీని వి ఆర్ ప్రతాప్ డైరెక్ట్ చేసాడు. ఈ మూవీ 61సెంటర్స్ లో 100డేస్ ఆడి,17సెంటర్స్ లో సిల్వర్ జూబ్లీ చేసుకున్న ఈ మూవీకి 5రోజుల ముందు మార్చి 31న రియల్ స్టార్ శ్రీహరి నటించిన బలరాం మూవీ రిలీజయింది. రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎవరేజ్ అయింది. అలాగే నువ్వొస్తావని మూవీకి 9రోజుల వ్యవధితో ఏప్రియల్ 14న ప్రిన్స్ మహేష్ బాబు నటించిన యువరాజు మూవీ రిలీజయింది.
వైవిఎస్ చౌదరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సిమ్రాన్,సాక్షి శివానంద్ హీరోయిన్స్. ఈ సినిమా కూడా ఏవరేజ్ గా నిల్చింది. రమణ గోగుల మంచి మ్యూజిక్ అందించారు. 77రోజులు 50రోజులు ఆడింది. నువ్వు వస్తావని మూవీకి ఆరు వారాల గ్యాప్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి మూవీ వచ్చింది. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో అమీషా పటేల్, రేణు దేశాయి హీరోయిన్స్ గా నటించారు. దీనికి కూడా రమణ గోగుల సంగీతం అందించారు. పవర్ స్టార్ రేంజ్ ని పెంచిన ఈ సినిమా 45సెంటర్స్ లో 100డేస్ ఆడింది. నిజానికి నువ్వు వస్తావని మూవీ కొంచెం వెనుకబడినప్పటికీ గట్టిపోటీ ఇచ్చిందని విశ్లేషకుల అంచనా.