MoviesTollywood news in telugu

హీరోయిన్ సరిత గురించి కొన్ని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Tollywood Heroine Saritha :హీరోయిన్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించి, సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ యాక్టర్ గా కూడా సత్తా చాటిన అలనాటి హీరోయిన్ సరిత అనగానే మరో చరిత్ర మూవీ గుర్తొస్తుంది. దర్శక దిగ్గజం కె బాలచందర్ తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ మూవీలో అప్పటి టాప్ హీరో కమల్ హాసన్ సరసన హీరోయిన్ గా సరిత నటించి,తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది.

అప్పటి యూత్ ని మరోచరిత్ర మూవీ ఆకట్టుకుంది. ఇందులో సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అయితే అభిలాష అనే పేరుతొ డైరీ రాసుకున్న సరిత జీవితంలోకి తొంగి చూస్తే, అప్పటి అభిలాష అమాయుకురాలు. ఇప్పుడు సరితకు లోకం పోకడ తెలిసి వచ్చింది అని ఉందట. నిజానికి చాలామంది స్నేహితులు ఉండడంతో అందరితో విషయాలు షేర్ చేసుకునేది.

కానీ రాను రాను ఫ్రెండ్స్ తగ్గిపోయారు. పైగా ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడదా మంటే భయం వేస్తోందట. అందుకే లేనిప్రేమను తెచ్చిపెట్టుకుని మాట్లాడాల్సి వస్తోందని సరిత చెబుతోంది. అభిలాష మొదట్లో లావుగా ఉంటూ ఏది పడితే అది తినేది. ఎప్పుడుపడితే అప్పుడు నిద్ర. కానీ సరితగా మారిన తర్వాత రేయింబవళ్లు పనిచేస్తోంది. ఇక ఎన్నో వత్తిళ్లు కూడా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం మంచి అవకాశాలు వస్తే నటిస్తూ ఉంది.