అనుష్క శర్మ రిస్ట్ వాచీ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే
Anushka sharma watch price :
సినిమా సెలబ్రిటీలు,క్రికెట్ సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ మామూలు రేంజ్ లో ఉండదు. చాలామంది సినిమా స్టార్స్ క్రికెటర్స్ ని ఇష్టపడతారు. పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. అందులో భాగంగానే బాలీవుడ్ లో పలు సినిమాలతో అలరించిన అనుష్క శర్మ కూడా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లాడింది.
కోహ్లీ,అనుష్క శర్మ లకు వామికా అనే కూతురుంది. ప్రస్తుతం ఫ్యామిలీ ట్రిప్ లో భాగంగా ఇంగ్లాండ్ లో ఉన్నారు. కూతురికి 6మంత్స్ బర్త్ డే వేడుక నిర్వహించారు. బ్రిటన్ లో వివిధ పర్యాటక ప్రాంతాల్లో తిరిగారు. ఇక తరచూ పలు విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ, యాక్టివ్ గా ఉండే అనుష్క రకరకాల ఫొటోలతో అలరిస్తూ ఉంటుంది.
తాజాగా షేర్ చేసిన ఫొటోలో ఆమె చేతి వాచీ గురించి చర్చ నడుస్తోంది. దీని ధర ఏకంగా అరకోటి అంటే అక్షరాలా 50లక్షలన్న మాట. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలో ఆమె ఖరీదైన చేతి వాచితో కన్పించింది. దీంతో నెటిజన్లు షాకవుతున్నారు. వావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.