చిన్నారి పెళ్లి కూతురు బామ్మ సురేఖా సిక్రీ ఇక లేరు
Chinnari Pelli Kuthuru Fame Surekha Sikri Passes Away : జాతీయ అవార్డ్ గ్రహీత చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ సురేఖ సిక్రీ ముంబై లో 75 సంవత్సరాల వయస్సులో శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
మూడు జాతీయ చలనచిత్ర అవార్డుల గ్రహీత సిక్రీ ఇటు సినిమాల్లోనే కాకుండా, థియేటర్, ఇంకా టీవీ సీరియల్స్‌లో కూడా నటించి మెప్పించారు.ఇక హిందీ డైలీ సీరియల్ “బలికా వదు” సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఆమెజోయా అక్తర్ దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ చిత్రం “ఘోస్ట్ స్టోరీస్” లో చివరిసారి కనిపించారు.