కార్తీక దీపం సీరియల్ కి నో చెప్పిన వంటలక్క…ఎందుకంటే…?
karthika deepam serial premi vishwanath : కాపుగంటి రాజేంద్ర డైరెక్షన్ లో బుల్లితెరపై సూపర్ సీరియల్ గా టాప్ టీఆర్ఫీ రేటింగ్ తో దూసుకుపోతున్న కార్తీక దీపం సీరియల్ కి ఉన్న ఆడియన్స్ ఆదరణ మామూలు రేంజ్ లో లేదు.ఈ సీరియల్ కోసం రోజూ ఎదురుచూపులు చూసే ఆడియన్స్ చాలామంది ఉన్నారు. కొత్త కొత్త ట్విస్టులతో సాగుతున్న ఈ సీరియల్ లో నటీనటులు తమ అందంతో,నటనతో ఆకట్టుకుంటున్నారు.
ముఖ్యంగా డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ పరిటాల, వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాధ్ బాగా ఇమిడిపోయారు. నిజానికి వంటలక్క పాత్రకోసం ప్రేమీ విశ్వనాధ్ ముందుగా ఒప్పుకోలేదట. మలయాళంలో హిట్ అయిన కరతముత్తు సీరియల్ కి రీమేక్ గా తీస్తున్నందున మీరే నటించాలని, మీరే సూటవుతారని డైరెక్టర్ ఒత్తిడి చేయడంతో చివరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.
అయితే తెలుగులో కార్తీక దీపం పేరిట వస్తున్న ఈ సీరియల్ లో వంటలక్క పాత్రకు వస్తున్న ఆదరణ చూసి, మలయాళం లో కన్నా ఇక్కడే ఎక్కువ క్రేజ్ వచ్చిందని ప్రేమీ విశ్వనాధ్ ఆనందంతో చెబుతున్నారు. ఇక రీమేక్ సందర్బంగా కార్తీక దీపం సీరియల్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసారు.