స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నారాయణ మూర్తి…ఏమిటో చూడండి
Tollywood Actor Narayana Murty :విప్లవ సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరైన రెడ్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి తానే నటిస్తూ,దర్శకత్వం వహిస్తూ ఎన్నో సినిమాలు తక్కువ బడ్జెట్ లో తీసి హిట్స్ అందుకున్నారు. మధ్యలో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలబడ్డారు. అంతేకాదు, తన సంపాదనలో కొంత మొత్తాన్ని పేదలకోసం ఖర్చుచేస్తూ మనసున్న రియల్ హీరోగా నిలిచారు.
ప్రస్తుతం రైతన్న సినిమా లో నటించారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉన్నా, కరోనా పరిస్థితులు కారణంగా ఆగింది. అయితే ఈ మధ్య కొన్ని సోషల్ మీడియాల్లో ఆర్ నారాయణమూర్తి పరిస్థితి ఏమీ బాగోలేదని, ఇబ్బందుల్లో ఉన్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ఖండన లేకపోవడంతో ఇంకా వైరల్ అవుతున్నాయి. దీంతో నారాయణమూర్తి స్పందించారు.
‘
నాపై సాగుతున్న దుష్ప్రచారం లో నిజం లేదు. నేను బాగానే ఉన్నాను. నేను దీన స్థితిలో లేను. కొంతమంది అభిమానులు ఫోన్ చేసి దీనస్థితిలో ఉన్నారంట అని అడుగుతుంటే బాధేస్తోంది. ఇలాంటి వార్తలు ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. మనసు ప్రశాంతంగా ఉండాలని పల్లెటూరిలో నివాసం ఉంటున్నాను’ అని నారాయణ మూర్తి వివరణ ఇచ్చాడు. రైతన్న కార్యక్రమంలో నారాయణమూర్తికి సొంత ఇల్లు లేదు, ఆస్థి లేదు, ఎంతదూరమైనా నడిచే వెళ్తాడు’ అని ప్రజా గాయకుడు గద్దర్ చెప్పడంతో సోషల్ మీడియాలో వార్తలు రివర్స్ అయ్యాయి.దాంతో క్లారిటీ ఇచ్చారు.