ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…?
Anushka Shetty Childhood Photoes : టాలీవుడ్ లో దాదాపుగా అందరు అగ్రహీరోల సరసన నటించి తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకుని లేడీ ఓరియంటెడ్ సినిమాలతో అభిమానులకు బాగా దగ్గరైన అనుష్కకి సంబంధించి చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమధ్య నిశ్శబ్దం సినిమాతో OTT ద్వారా ప్రేక్షకులను అలరించింది.
ఈ ఫోటోలో తల్లి ఒడిలో కూర్చుని ఫోటోకి కెమెరా వైపు లుక్ ఇస్తుంది చిన్నప్పటి అనుష్క. సినిమాలను ఆచితూచి ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది తమిళంలో ఒక సినిమా చేస్తోంది. తెలుగులో యంగ్ హీరోతో ఒక సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అనుష్క తన అందంతో నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం అనుష్క చిన్నప్పటి ఫ్యామిలీ ఫోటో అభిమానులను ఎంతగానో అలరిస్తుంది.