గోపీచంద్ లౌక్యం సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి…?
Gopichand Loukyam Movie : కామెడీ,యాక్షన్ తో కూడిన గోపీచంద్ నటించిన లౌక్యం మూవీ మంచి విజయాన్ని అందుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా గ్లామర్ తో అలరించింది. 22కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ ఘన విజయాన్ని నమోదుచేసింది. 2014సెప్టెంబర్ 26న రిలీజైన ఈ మూవీని డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అలరించింది. అయితే ఈ మూవీ సమయానికి స్టార్ హీరోల మూవీస్ కూడా వచ్చాయి. వాటిని తట్టుకుని లౌక్యం విజయాన్ని అందుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు,శ్రీను వైట్ల కాంబోలో సెప్టెంబర్ 19న ఆగడు, రవితేజ నటించిన పవర్ మూవీస్ కూడా అదేసమయంలో రిలీజయ్యాయి. అంతకుముందు మహేష్, శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన దూకుడు రేంజ్ ని దృష్టిలో పెట్టుకుని భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. థమన్ సంగీతం అందించగా, తమన్నా హీరోయిన్ గా చేసింది. అయితే డిజాస్టర్ టాక్ రావడంతో భారీ నష్టాన్ని చూసింది. 65కోట్లతో తీసిన ఈ మూవీ 32కోట్లు మాత్రమే రాబట్టింది.
ఇక ఆగడు కి వారం ముందుగా, లౌక్యానికి రెండు వారాల ముందు రవితేజ పవర్ వచ్చింది. హన్సిక హీరోయిన్. సెప్టెంబర్ 2న వచ్చిన ఈ మూవీని కె ఎస్ రవీంద్ర తెరకెక్కించాడు. 25కోట్ల వరకూ షేర్ తెచ్చిన ఈ మూవీలో రవితేజ చెలరేగిపోయాడు. ఇక కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే మూవీ రిలీజయింది. కాజల్ హీరోయిన్. లౌక్యం మూవీకి 5రోజుల గ్యాప్ తో అక్టోబర్ 1న వచ్చిన ఈ మూవీ లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు వేశారు. ఈ మూవీ ఏవరేజ్ అయినా 40కోట్లు గ్రాస్ తెచ్చింది. మొత్తానికి లౌక్యం మూవీ విజయాన్ని ఈ సినిమాలేవీ అడ్డుకోలేక పోయాయి.