రాధమ్మ కూతురు సీరియల్ రాధమ్మ లైఫ్ స్టైల్…ఎన్ని కోట్ల ఆస్తి…?
Radhamma Kuthuru Serial Radhamma LifeStyle : బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న రాధమ్మ కూతురు సీరియల్ లో నటీనటులు తమ అందంతో,నటనతో ఆకట్టుకుంటున్నారు. ఇందులో రాధమ్మగా నటిస్తున్న వ్యక్తిపేరు మేఘన. ఈమె 29జులైలో ఈశ్వర్,సుహాసిని దంపతులకు జన్మించింది. ప్రస్తుతం 38ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఈమెకు సిస్టర్ వినిలా,బ్రదర్ అనిరుద్ ఉన్నారు. ఈమెను మేఘన,రాధమ్మ అని కూడా పిలుస్తున్నారు. 2005లో సీరియల్ హీరో ఇంద్రనీల్ తో పెళ్లయింది.
చిన్నప్పటి నుంచి డాన్సింగ్, యాక్టింగ్ అంటే ఇష్టం గల మేఘన ఫ్యామిలీ చిన్నతనంలోనే చెన్నైలో సెటిల్ అయ్యారు. ఈమె చిన్ననాటి నుంచి డాన్స్ నేర్చుకుంది. చెన్నైలో డిగ్రీ పూర్తిచేసింది. ఫోటో షూట్ తీయించుకుని చాలా మూవీస్ లో ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేసింది. ఇష్టం లేకున్నా జాబ్ లో చేరింది. ఉద్యోగం చేసున్న సమయంలో ప్రొడక్షన్ కంపెనీ నుంచి కాల్ రావడంతో తమిళ సీరియల్ లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. జాబ్ వదిలేసి,సీరియల్స్ పై దృష్టి పెట్టడంతో 11కి పైనే సీరియల్స్ లో చేసింది. 2000లో ప్రసారమైన ముత్తైదువ సీరియల్ తో దూరదర్శన్ ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
ఇక కాలచక్రం, బొమ్మరిల్లు,ఆత్మీయులు, గృహప్రవేశం, చక్రవాకం, ప్రియాంక వంటి సీరియల్స్ లో చేసి,పెళ్లి తర్వాత గ్యాప్ ఇచ్చింది. అయితే గోరంత దీపం సీరియల్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పక్కింటి అమ్మాయి, మహాలక్ష్మి, సీరియల్స్ లో చేసి, జీ తెలుగులో రాధమ్మ కూతురు సీరియల్ లో రాధమ్మగా అదరగొట్టేస్తోంది. కనులు మూసినా నీవాయే వంటి మూవీస్ లో చేసింది. మేఘన కు ఇంట్లో తయారుచేసిన ఫుడ్ ఇష్టం. ట్రావెలింగ్, కుకింగ్, షాపింగ్ అంటే హాబీస్. ఒక్కో ఎపిసోడ్ కి 13వేలు తీసుకునే ఈమె నెట్ వర్త్ 2కోట్ల 90లక్షలు. ఇక హీరోల్లో అల్లు అర్జున్, హీరోయిన్స్ లో సమంత అంటే ఇష్టం. ఊటీ,పారిస్ అంటే ఇష్టం. మేఘన దంపతులకు రెండు కార్లున్నాయి. ఖరీదైన ఇల్లు ఉంది.