నారప్ప సినిమాలో వెంకటేష్ తో రొమాన్స్ చేసిన ఈ భామ ఎవరో తెలుసా ?
Narappa beauty ammu abhirami : శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి,అమ్ము అభిరామి నటించారు. మనకు ప్రియమణి గురించి తెలుసు అయితే అమ్ము అభిరామి ఎవరా అని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు.
ఓ నారప్ప అనే పాటలో అమ్ము అభిరామి బాగా హైలెట్ అయ్యింది. ఈమె చెన్నై పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది. ఈమె చదువుకునే రోజుల నుంచే సినిమాల్లో నటించింది. 2017 లో విజయ్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో వచ్చిన భైరవ అనే సినిమాలో మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా నటించి పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత రాక్షసుడు సినిమాలో హీరో మేనకోడలి పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకుంది. అమ్ము అభిరామికి కోలీవుడ్,టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న నవరస అనే సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది. సెలక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది అమ్ము అభిరామి.నారప్ప సినిమా విడుదల అయింది కదా ఇక ఇప్పుడు ఈమె నటనకు అభిమానులు ఫిదా అవ్వడం ఖాయం అలాగే అవకాశాలు కూడా భారీగానే వస్తాయి.