MoviesTollywood news in telugu

వెంకటేష్ నారప్ప సినిమా రివ్యూ….హిట్టా…ఫట్టా…?

Narappa movie review in telugu : శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప నిన్న రాత్రి 10 గంటలకు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. కథ విషయానికి వస్తే నారప్ప(వెంకటేష్) సుందరమ్మ(ప్రియమణి) పెద్దకొడుకు ముని కన్నా(కార్తిక్ రత్నం) ఇతను చాలా ఆవేశపరుడు తమ పొలంలోని హక్కులకోసం ఊరి పెద్ద మనిషిని ఎదిరిస్తాడు ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా ఊరి పెద్దమనిషి పై ముని కన్నాపై చేయి చేసుకుంటాడు. దాంతో ఆ ఊరి పెద్ద పగబట్టి ముని కన్నా ని దారుణంగా చంపేస్తాడు దాంతో నారప్ప చిన్న కొడుకు సినప్ప ఆ పెద్దమనిషిని నరికేస్తాడు ఆ తరువాత వారి నుండి చిన్న కొడుకును కుటుంబాన్ని నారప్ప ఎలా కాపాడుకున్నాడు అనేదే కథ. నారప్పకు గతం ఉంటుంది గతం గురించి సినప్పకు ఎలా తెలుస్తుంది చివరకు కథ ఏవిధంగా ముగిసింది అనేది చూడాలి అంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే

ప్లస్ పాయింట్లు
వెంకటేష్ నటన,క్లైమాక్స్,ఎమోషన్స్,యాక్షన్ సీన్స్,మాస్ ఎలివేషన్స్

మైనస్ పాయింట్స్
నరేషన్ స్లోగా ఉండటం,కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గా ఉన్న ఫీలింగ్,ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు రంగస్థలం సినిమా లోని సీన్స్ ని గుర్తు చేయటం