MoviesTollywood news in telugu

విజయ్ ప్రైవేట్ జెట్ హంగులు చూస్తే షాక్ అవ్వాలసిందే

Vijay devarakonda privet jet specialities : పెళ్లిచూపులు మూవీతో ఎంట్రీ ఇచ్చి, అర్జున్ రెడ్డి మూవీతో ఫామ్ లోకి వచ్చి, గీత గోవిందం మూవీతో స్టార్ హీరోల సరసన చేరిన విజయ్ దేవరకొండ ఈ మధ్య కొన్ని ప్లాప్ లు కూడా చూసాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న లైగర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఈ రౌడీ స్టార్. అలాగే ఫైటర్,హీరో సినిమాలు కూడా చేస్తున్నాడు.

మహానటి సినిమాలో కూడా తనదైన నటన కనబరిచిన విజయ్ తన తమ్ముడిని కూడా హీరోగా ఎంట్రీ ఇప్పించాడు. మరోపక్క యాడ్స్ లో కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. వచ్చిన సొమ్ముని బిజినెస్ లో పెట్టుబడులు పెట్టి ఇంకా బాగా సంపాదిస్తున్నాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లకు ఉన్నట్లే సొంత విమానం కూడా విజయ్ కి ఉంది.

ఈ ప్రయివేట్ జెట్ లో అదిరిపోయే అధునాతన సౌకర్యాలు ఉన్నాయంటున్నారు. నలుగురు మాత్రమే కూర్చోడానికి వీలుగా ఉండే ఈ జెట్ లో విశాలంగా ఉండడంతో పాటు కళ్ళకు ఇట్టే ఆకర్షించే విధంగా ఇంటీరియర్ డెకరేషన్ కూడా ఉంటుందట. డైనింగ్ కి కూడా ఏర్పాట్లు ఉన్నాయట.అగ్ర హీరోలకు తీసిపోని విధంగా ప్రయివేట్ జెట్ ని మెయింటైన్ చేస్తున్న రౌడీ స్టార్ హిందీలో కూడా లైగర్ మూవీతో ఆకట్టుకుంటాడేమో చూడాలి.