కృష్ణ కొడుకు రమేష్ బాబు కెరీర్ అలా అవ్వటానికి కారణాలు ఇవే
Tollywood Hero Ramesh babu :సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి, కొన్ని సినిమాల తర్వాత ఇక ఇండస్ట్రీ నుంచి హీరోగా తప్పుకుని నిర్మాతగా కొన్నాళ్ళు పనిచేసాడు. అయితే కృష్ణ నటించిన అగ్ని పరీక్ష మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన రమేష్ బాబు, ఆతర్వాత ఏకంగా 15మూవీస్ లో బాలనటుడిగా కన్పించాడు. ఇక 15ఏళ్ళ వయస్సు వచ్చాక నీడ మూవీలో నటించాడు. దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అందరూ కొత్తవాళ్లే. ఈ మూవీతోనే విప్లవ వీరుడు ఆర్ నారాయణ మూర్తి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే నీడ మూవీలో రమేష్ బాబు చిన్నప్పటి పాత్రను మహేష్ బాబు వేసాడు.
అంతేకాదు, అసలు పాటలు లేకుండా చేసిన సినిమా నీడ. ఇక ఎనిమిదేళ్లు గ్యాప్ ఇచ్చి, సామ్రాట్ మూవీతో హీరోగా ప్రవేశించాడు. 1986ఆగస్టు 29న రాజేంద్ర సింగ్ బాబు డైరెక్షన్ లో సామ్రాట్ మూవీ షూటింగ్ చెన్నై ఏవిఎం స్టూడియోలో స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచి నటించడం, కృష్ణతో షూటింగ్స్ కి వెళ్లడం వలన ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. అయితే డైలాగ్స్ విషయంలో మాత్రం అగ్ని పరీక్ష డైరెక్టర్ వరప్రసాదరావు దగ్గర శిక్షణ తీసుకున్నాడు. బాలీవుడ్ నటి సోనమ్ హీరోయిన్. అక్కినేని నాగేశ్వరరావు కెమెరా స్విచాన్ చేసారు. సినిమా షూటింగ్ మందకొడిగా సాగడంతో డైరెక్టర్ ని మార్చేసి, విక్టరీ మధుసూదనరావుని పెట్టారు.
అయితే అదే సమయంలో కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా సామ్రాట్ షూటింగ్ స్టార్ట్ అయింది. దాంతో సినిమా టైటిల్ మాదంటే మాదని వాదనకు దిగారు. చివరకు రెండు చిత్రాల దర్శకులు కోర్టుకి వెళ్లారు. చివరకు రమేష్ బాబుకి ఈ టైటిల్ దక్కింది. ఇక నటన ఎలా ఉంటుందో చూడకుండానే 15మంది ప్రొడ్యూసర్స్ క్యూ కట్టి ,అడ్వాన్స్ ఇచ్చేసారు. తొలిసినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. చిన్ని కృష్ణుడు, కలియుగ కర్ణుడు మూవీస్ లో నటించాడు. 4వ మూవీ బజార్ రౌడీ తో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ తో బిజీగా ఉన్న నదియాకు హీరోయిన్ గా ఇదే తొలిసినిమా.
పైగా డ్యూయెల్ రోల్. 65లక్షలు ఖర్చయిన ఈ సినిమాకు యాక్షన్ ఎపిసోడ్స్ కి బాగా ఖర్చయింది. బయ్యర్లు ముందుకు రాకపోవడంతో నిర్మాత యు సూర్యనారాయణ బాబు నేరుగా రిలీజ్ చేసారు. ఇందుకోసం 15లక్షలు కృష్ణ సర్దుబాటు చేసారు. బజారు రౌడీ,ముగ్గురు కొడుకులు శత దినోత్సవాలు ఒకే వేదికపై పద్మాలయ స్టూడియోలో చేయాలనుకున్నారు. అయితే కృష్ణ తల్లి నాగరత్నమ్మ మరణంతో అది నెరవేరలేదు.అలా నటిస్తూ ఉండగా కొన్ని సినిమాలు ప్లాప్ కావటం,సరైన హిట్ పడకపోవటంతో నిదానంగా పరిశ్రమకు దూరం అయ్యాడు.