MoviesTollywood news in telugu

విలన్స్ కారణంగా హిట్ అయిన సినిమాలు ఎన్ని ఉన్నాయో…?

Tollywood Hit Movie vilans :ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే విలన్ కూడా బలంగా ఉండాలి. సరిజోడీ లేకుంటే కిక్కు ఉండదు. అందుకే విలన్ సెలక్షన్ లో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. విలనిజం పండడం వలన ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అందుకే తన సినిమాల్లో విలన్ డిఫరెంట్ గా ఉండేలా చూస్తాడు. ఇక బాహుబలి మూవీకైతే ఏకంగా రానానే విలన్ గా సెలక్ట్ చేయడం ప్లస్ పాయింట్ అయింది. ప్రభాస్ బాహుబలిగా నటించిన ఈ సినిమాలో భల్లాల దేవుడిగా అద్భుతమైన విలనిజంలో రానా ఆడియన్స్ మనసు దోచాడు.

తేజ డైరెక్ట్ చేసిన జయం మూవీలో గోపీచంద్ విలన్ గా నటించి తన నటనతో సినిమాకు విజయాన్ని అందించాడు. నితిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీలో సదా హీరోయిన్ గా చేసింది. కానీ విలన్ గా గోపీచంద్ తన నటనతో మెప్పించాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన నిజం సినిమాలో కూడా గోపీచంద్ విలనిజం అదిరిపోయింది. ఇక అతిధి మూవీలో మహేష్ బాబు హీరోగా చేస్తే, మురళీ శర్మ విలన్ గా బాగా రాణించాడు. అలాగే మహేష్ బాబు హీరోగా చేసిన స్పైడర్ మూవీలో డైరెక్టర్ సూర్య విలన్ గా నటించి మెప్పించాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ధ్రువ మూవీ హిట్ అయిందంటే అందుకు విలన్ గా నటించిన ఒకప్పటి హీరో అరవింద్ స్వామి కారణం. వైట్ కాలర్ నేరస్తుడిగా సైలెంట్ విలనిజంతో అరవింద్ స్వామి ఆకట్టుకున్నాడు. నాగ చైతన్య హీరోగా వచ్చిన యుద్ధం శరణం గచ్ఛామి మూవీలో ఒకప్పటి హీరో శ్రీకాంత్ విలన్ గా నటించి మెప్పించాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన గ్యాంగ్ లీడర్ మూవీలో హీరో కార్తికేయ విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వచ్చిన మాస్టర్ మూవీలో విలన్ గా విజయ్ సేతుపతి నటించి తన నటనతో క్రేజ్ తెచ్చాడు. అలాగే విశాల్ హీరోగా వచ్చిన అభిమన్యుడు మూవీలో ఒకప్పటి హీరో అర్జున్ విలన్ గా మెప్పించాడు.