ఒక్కప్పటి సీరియల్ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
chakravakam serial pavani : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మొదట్లో సీరియల్స్ దర్శకత్వం వహించాడు. ఆవిధంగా అతడి డైరెక్షన్ లోని శాంతినివాసం సీరియల్ ధారావాహికంగా నడిచింది. అందులో నటించడం ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన నటి పావని పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా చేసింది.
బుల్లితెర మీద ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన చక్రవాకం సీరియల్ లో నెగెటివ్ రోల్ పోషించి ఆకట్టుకున్న పావని ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. పలు సీరియల్స్ లో చేసిన ఈమె ఇక జక్కన్న డైరెక్ట్ చేసిన సింహాద్రి, వంటి సినిమాల్లో ప్రాధాన్యత గల పాత్రలు పోషించి ఆకట్టుకుంది.
అయితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లిచేసుకున్నాక ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసి, ఫ్యామిలీతో హ్యాపీ గా హైదరాబాద్ లోనే ఉంటోంది. వాస్తవానికి ఈమె హైదరాబాద్ లోనే పుట్టిపెరిగి, అక్కడే స్టడీస్ పూర్తిచేసింది. ఆమె తండ్రి కృష్ణమూర్తి అప్పటిలో దూరదర్శన్ ధారావాహిక సీరియల్స్ కి డైరెక్టర్ గా ఉండేవాడు. దాంతో పావనికి కూడా నటనపై ఆసక్తి ఏర్పడి, సీరియల్స్, సినిమాల్లో చేసింది.