అరవింద్ స్వామి డాటర్ ఏమి చేస్తుందో తెలుసా?
Aravind swamy daughter Details :మణిరత్నం డైరెక్ట్ చేసిన రోజా,ముంబయి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న అందాల నటుడు అరవింద్ స్వామి తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. అయితే సినిమాలు మానేసి, ఇండస్ట్రీకి దూరంగా జరిగిన అరవింద్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టాడు. ఇక అతడి కూతురు అదిర ఆ సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటోంది.
వాస్తవానికి సినిమాల్లో ఉండగానే పెళ్లిచేసుకున్న అరవింద్ కి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అయితే కొన్నాళ్లకే వివాదం రావడంతో విడాకులు తీసుకున్నాడు. ఇక అతడి కూతురు అదిర తండ్రిని మించిన తనయ. ఈమె లండన్ లో స్టడీస్ పూర్తిచేసింది. డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్.
సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వహిస్తున్న సమయంలో సినిమాల్లో ఛాన్స్ లు రావడంతో అరవింద్ స్వామి తన్ని ఒరువన్ అనే తమిళ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక అదే సినిమా తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటించిన ధ్రువ పేరుతొ రీమేక్ అయింది. అందులో కూడా అరవింద్ నెగెటివ్ షేడ్ లోనే వేసాడు. ఇలా సినిమాల్లో బిజీ కావడంతో బిజినెస్ వ్యవహారాలను కుమార్తె చక్కబెడుతోంది.