MoviesTollywood news in telugu

జల్సా సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?

pawan kalyan jalsa movie :హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా కలెక్షన్ల పరంగా దూసుకెళ్లే పవర్ స్టార్ క్రేజ్,పాపులార్టీ మాములుగా ఉండదు. ఇక సినిమా హిట్ అయితే ఆ రేంజ్ వేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పవన్ నటించిన జల్సా మూవీ బ్లాక్ బస్టర్ అయింది. 2008ఏప్రియల్ 2న రిలీజైన ఈ మూవీ సమయంలో కొన్ని సినిమాలు వచ్చాయి. వాటన్నింటిని తట్టుడుకుని జల్సా నిల్చింది. ఇలియానా గ్లామర్, బ్రహ్మానందం,పవన్ కామెడీ, ఎమోషన్ అన్నీ కుదిరాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అసెట్ గా నిల్చింది. ఆడియో సిడిల ద్వారా కోటి రూపాయలు అందుకున్న తొలి సినిమాగా రికార్డుకెక్కింది.

మొదటి లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సినిమా ఇదే. అలాగే మొదటి వారం ఏకంగా 20కోట్లు కలెక్ట్ చేసిన మూవీ జల్సా . యుఎస్ లో రెండు సెంటర్స్ లో 100డేస్ ఆడిన సినిమా ఇది. 220సెంటర్స్ పైగా 50రోజులు,22కేంద్రాల్లో 100డేస్ ఆడింది. ఆ ఏడాది హయ్యస్ట్ గ్రాస్ తో 30కోట్ల షేర్ రాబట్టింది. అయితే ఈ మూవీ సమయంలో కొన్ని సినిమాలు వచ్చాయి. నితిన్ హీరోగా ఆటాడిస్తా మూవీ జల్సాకు 12రోజుల ముందు వచ్చింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేసింది. ఏవరేజ్ అనిపించుకున్న ఈ మూవీ కలెక్షన్స్ పరంగా ప్లాప్ అయింది. జల్సా మూవీ రావడం కూడా ఆటాడిస్తాకు మైనస్.

జల్సా వచ్చిన 4రోజులకే అలీ నటించిన తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే మూవీ వచ్చింది. రామ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. తరుణ్,ఇలియానా హీరో హీరోయిన్స్ గా వచ్చిన భలే దొంగలు మూవీ కూడా జల్సా ముందు నిలవలేదు. జల్సాకు 9రోజుల గ్యాప్ తో వచ్చిన ఈ మూవీ కి కె విజయ భాస్కర్ డైరెక్టర్. కథ,కధనం కొత్తగా ఉన్నా, బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని దక్కించుకోలేక, ఏవరేజ్ గా నిల్చింది. సుశాంత్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటించిన కాళిదాసు మూవీ కూడా ఇదేరోజు రిలీజయింది. చక్రీ మ్యూజిక్ అందించారు. ఏవరేజ్ అయింది. అయితే ఆ ఏడాది జల్సా మూవీతో నిజంగానే జల్సా చేసాడు.