MoviesTollywood news in telugu

మన హీరోలు అందుకునే పారితోషికం ఎంత పెంచేశారో తెలుసా?

Tollywood heros latest remunerations : సినిమా సాంకేతికంగా ఎంతగా ఎదిగిందో అంతగా మన హీరోల రెమ్యునరేషన్ కూడా పెరుగుతూ వస్తోంది.దాంతో సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంటోంది. మన హీరోలు అందుకునే రెమ్యునరేషన్ పరిశీలిస్తే, స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి, దాదాపు 10ఏళ్ళు విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. యువ హీరోలకు ధీటుగా నటిస్తున్న చిరంజీవి ప్రస్తుతం ఆచార్య మూవీలో నటిస్తున్నారు. ఇందుకోసం 50కోట్లు అందుకుంటున్నట్లు టాక్.

అయితే చిరు తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఇప్పటికీ 5కోట్లు మాత్రమే తీసుకుంటున్నారట. ఇక యంగ్ హీరోల్లో చాలామంది 5కోట్ల వరకే తీసుకుంటున్నారట. అయితే చిరుతో సమానంగా మాస్ ఇమేజ్ తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న అఖండ మూవీలో 12కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక జనసేన పార్టీ కొనసాగిస్తూ, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన దూకుడు మరింత పెంచారు. వకీల్ సాబ్ మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా నటిస్తున్న హరిహర వీరమల్లు,అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ మూవీ చేస్తున్న పవన్ ఒక్కో మూవీకి 50నుంచి 60కోట్లు అందుకుంటున్నట్లు టాక్.

బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అయితే ఒక్కో సినిమాకు ఏకంగా 100కోట్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. రాధేశ్యాం,ఆదిపురుష్,సలార్ మూవీస్ లో చేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరూ మూవీకోసం 50కోట్లు అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సర్కారువారి పాట మూవీకోసం 65కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.

అలవైకుంఠపురం మూవీలో నటించి ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప మూవీ చేస్తున్నాడు. గతంలో పాతిక కోట్లుండే రెమ్యునరేషన్ 35కోట్లకు పెంచేసినట్లు, ప్రస్తుతం 50కోట్ల వరకూ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటిస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు 35కోట్లు చొప్పున అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

గీత గోవిందం మూవీతో స్టార్ హీరోల సరసన చేరిన విజయ్ దేవరకొండ తాజాగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ లైగర్ లో నటిస్తున్నాడు. దీనికోసం ఏకంగా 30కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. ఇక మాస్ మహారాజు రవితేజ 15కోట్లు,రామ్ 13కోట్లు,నేచురల్ స్టార్ నాని 12కోట్లు, నాగచైతన్య 8కోట్లు అందుకుంటున్నారట.