MoviesTollywood news in telugu

టాలీవుడ్ యంగ్ హీరోలు ఎంత బిజీగా ఉన్నారో…?

Tollywood young heros movies : కొత్తనీరు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. టాలెంట్ తో పాటు అదృష్టం ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడతారు. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య మూవీ ఓటిటి లో రిలీజై బాగానే ఆకట్టుకుంది. ఇందులో హీరోగా చేసిన సత్యదేవ్ నటించిన తాజా మూవీ తిమ్మరుసు రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఆగస్టులో విడుదల చేస్తారట. ప్రస్తుతం తమన్నాతో కల్సి ‘గుర్తుందా శీతాకాలం’ మూవీ చేస్తున్నాడు. అలాగే గాడ్సే, స్కైలాబ్ మూవీస్ చేస్తున్నాడు.

విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళ్తూ,యాడ్స్ లో కూడా నటిస్తూ,మరోపక్క ప్రొడక్షన్ లో కూడా అడుగుపెట్టాడు. ఇక అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇండస్ట్రీకి వచ్చాడు. దొరసాని మూవీతో ఆనంద్ ఎంట్రీ ఇచ్చి, మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీతో అలరించాడు. ఇక హైవే పేరుతొ కెవి గుహన్ డైరెక్షన్ లో ఒక మూవీ,పుష్పక విమానం పేరిట దామోదర డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు.

ఎస్ ఆర్ కల్యాణ మండపం మూవీతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ఆ సినిమా రిలీజ్ కాకుండానే,సెబాస్టియన్ అనే మూవీ చేస్తున్నాడు. సమ్మతమే అనే మరో మూవీతో పాటు ఇంకొక మూవీ కూడా చేస్తున్నాడు. మరో యంగ్ హీరో కార్తికేయ తాజాగా ప్రశాంత్ డైరెక్షన్ లో రుహాని శర్మ హీరోయిన్ గా ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే తమిళంలో అజిత్ తో కల్సి వాలిమై మూవీ కూడా చేస్తున్నాడు. మరోపక్క రాజా విక్రమార్క మూవీ కూడా ఒకే చేసాడు.