MoviesTollywood news in telugu

నటి శ్రీవిద్య సంపాదించిన ఆస్తిని ఎవరికి ఇచ్చేసిందో తెలుసా ?

Tollywood actress srividya :సినిమాల్లో సంపాదించిన సొమ్మును ఇప్పటి హీరో హీరోయిన్స్ వేరే రంగాల్లో పెట్టుబడులు పెట్టి రాణిస్తుంటే, ఒకప్పుడు హీరో హీరోయిన్స్ తాము సంపాదించినది సర్వం పోగొట్టుకుని చివరి దశలో చాలా దీనావస్థలో గడిపింది కొందరైతే, మరికొందరు తమ ఆస్తులను దానంగా ఇచ్చేసారు. ఇలా దానం చేసిన వాళ్లలో నటి శ్రీవిద్య ఒకరు. ఈమె బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసి, పెద్దయ్యాక కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. ఎక్కువగా కె బాలచందర్ మూవీస్ లో చేసింది.

ఎమోషనల్ సన్నివేశాలలో శ్రీవిద్య నటన అద్భుతం.ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సత్తా చాటిన శ్రీవిద్య 53 ఏళ్ళ వయస్సులోనే ప్రాణాలు కోల్పోయింది. సుమంత్ నటించిన విజయ్ ఐపీఎస్ ఆమె చివరి సినిమా. ఇక కెరీర్ తొలినాళ్లలో కమల్ హాసన్ ప్రేమలో పడింది. అనివార్య కారణాల వలన అసిస్టెంట్ డైరెక్టర్ జార్జి థామస్ ని పెళ్లాడింది. అయితే భర్త ప్రవర్తన నచ్చకపోవడంతో విడాకులు ఇచ్చేసి, భరతన్ అనే మరో డైరెక్టర్ ని పెళ్లి చేసుకుంది.

భరతన్ ప్రవర్తన కూడా తేడా కొట్టింది. అంతేకాదు, ఆమె ఆస్తులను లాక్కోవడానికి ప్రయత్నం చేయడంతో కోర్టు తలుపు తట్టి విజయాన్ని సాధించింది. 2003లో క్యాన్సర్ సోకడంతో ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పేద సంగీత,నృత్య కళాకారులకు సాయం అందించింది. స్కాలర్ షిప్స్ ఇచ్చింది. ఇక మిగిలిన ఆస్తిని పనివాళ్లకు, బంధువులకు ఇచ్చేసింది. సొంతూరికి కొంత ఇచ్చేసింది.