బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి రియల్ లైఫ్…ఎన్ని కోట్ల అస్థి…?
Tv Actor Rohini Lifestyle :బుల్లితెరపై తన నటనతో సందడి చేస్తూ,బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చి అల్లరి చేసిన రోహిణి అసలు పేరు రోహిణి రెడ్డి. రోహిణి, రౌడీ అని కూడా పిలుస్తారు. పోలీసాఫీసర్ అవ్వబోయి, యాక్టర్ అయింది. విశాఖపట్నంలోని నాగయ్యపేటలో 1990సెప్టెంబర్ 9న సింహాద్రి, గోవిందమ్మ లకు జన్మించిన ఈమెకు ప్రస్తుతం 30ఏళ్ళు నిండుతాయి.
ఈమెకు అనూరాధ అనే ఓ సిస్టర్ ఉంది. యలమంచిలి స్కూల్లో చదివిన ఈమె విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. స్టడీస్ పూర్తయ్యాక జాబ్ రావడం,అందులో చేరడానికి నాలుగు నెలల సమయం ఉండడంతో హైదరాబాద్ కోచింగ్ సెంటర్ లో చేరింది.కోచింగ్ సెంటర్ లో జోక్స్ వేస్తుంటే, అది చూసిన ఒకతను యాక్టింగ్ చేస్తావా అని అడిగితె ఒకే అని రోహిణి చెప్పిందట. అప్పట్లో దూరదర్శన్ లో తెలుగింటి అమ్మాయి షో డైరెక్టర్ కి పరిచయం చేసాడు.
సిస్టర్ తో కల్సి ఈ ప్రోగ్రాం లో పాల్గొన్న రోహిణి ఆ తర్వాత దూరదర్శన్ లో యాంకరింగ్ కూడా చేసింది. జి తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఆడిషన్స్ లో పాల్గొని, సెలక్ట్ అయింది. ఈమె కోసం చాలా కామెడీ ఎపిసోడ్స్ ని డైరెక్టర్ రసూల్ రాసారు. మాటీవీలో శ్రీనివాస కళ్యాణం సీరియల్ లో అదరగొట్టేసిన ఈమె జెమినిలో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సీరియల్ లో నటించింది. అయితే 2016లో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలవ్వడంతో ఏడాదిపాటు రెస్ట్ లోకి వెళ్ళింది.
తర్వాత జబర్దస్త్ షోలో రోహిణి కొన్ని స్కిట్స్ చేసింది. టచ్ చేసి చూడు, గోపికమ్మ, నల్లనయ్య మూవీస్ లో నటించింది. 2019లో బిగ్ బాస్ సీజన్ త్రిలో పాల్గొంది. రౌడీ రోహిణి పేరిట నడుపుతున్న యూట్యూబ్ ఛానల్ కి 3లక్షల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. హీరోస్ లో చిరంజీవి,నాగార్జున, హీరోయిన్స్ లో శ్రీదేవి,కోవై సరళ ప్రదేశాల్లో గోవా, పారిస్ అంటే ఈమెకు ఇష్టం.
కుక్కపిల్లలంటే ఇష్టం. బ్యాడ్మింటన్ ఆడడం హాబీ. ఎపిసోడ్ కి 20వేలవరకూ అందుకుంటుంది. హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్స్ లో కోటిన్నర విలువైన ఫ్లాట్ లో ఉంటోంది. ఈమెకు రెండు కార్లున్నాయి. ఒక వైపు సీరియల్స్ మరోవైపు సినిమాలు,యూట్యూబ్ చానల్ అంటూ బాగానే సంపాదిస్తుంది.