యశ్వంత్ మాస్టర్ TOP కొరియోగ్రఫీ సాంగ్స్…ఎన్ని హిట్ అయ్యాయో…?
Yashwanth Master Choreography Songs : సినిమాల్లో ఒకప్పుడు కొరియోగ్రాఫర్స్ ఉన్నా అంతగా గుర్తింపు ఉండేది కాదు. కానీ అక్కినేనితో మొదలైన స్టెప్స్ పరంపర మెగాస్టార్ చిరంజీవితో మంచి ఊపందుకుంది. ఇలా పలువురు నటులు డాన్స్ కి ప్రాధాన్యత ఇవ్వడంతో కొరియోగ్రాఫర్స్ కి కూడా విలువ పెరిగింది. టివి చానల్స్ లో పలు డాన్స్ షోలు కూడా రన్ అవుతున్నాయి. ఇక యస్వంత్ మాస్టర్ విషయానికి వస్తే,ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న భస్మాసుర మూవీకి కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. రాజా మీరు కేక మూవీలో ఐటెం సాంగ్ కి డాన్స్ కంపోజ్ చేసి పేరు తెచ్చుకున్నాడు.
ఇక భలే మంచి చౌక బేరం మూవీలో అన్ని సాంగ్స్ కి యస్వంత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి మూవీలో గ్లాస్ మేట్స్ సాంగ్ కి యస్వంత్ మంచి డాన్స్ కంపోజ్ చేసి, ఫామ్ లోకి వచ్చాడు. అలాగే ప్రతిరోజూ పండగే మూవీలో ఓ బావా అనే సాంగ్ కి డాన్స్ కంపోజ్ చేసాడు. వరుణ్ తేజ్ నటించిన తమిళ్ మూవీ ధరాల ప్రభులో టైటిల్ సాంగ్ కి కొరియోగ్రఫీ అందించాడు. సమంత నటించిన యు టర్న్ మూవీలో కర్మ థీమ్ కి కొరియోగ్రఫీ ఇచ్చాడు. జార్జిరెడ్డి మూవీలో రాయల్ ఎంఫిల్డ్ సాంగ్ కి యస్వంత్ కొరియోగ్రఫీ ఇచ్చాడు.
ఈ మాయ పేరేమిటో మూవీలో నాలుగు సాంగ్స్ కి యస్వంత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. సోలో బెటరే సో బతుకే మూవీలో నో పెళ్లి సాంగ్ కి అద్భుతంగా డాన్స్ కంపోజ్ చేసాడు. 30రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీలో నీలి నీలి ఆకాశం సాంగ్ కి యస్వంత్ డాన్స్ కంపోజ్ చేసాడు. భంబాటి మూవీలో చుప్పనాటి సాంగ్, తాగితే తందానా మూవీలో అన్ని సాంగ్స్ కి డాన్స్ కంపోజ్ చేసాడు.ఏక్ మినీ కథలో అన్ని సాంగ్స్ కి డాన్స్ అందించాడు.