కేరాఫ్ అనసూయ సీరియల్ నటి పావని రియల్ లైఫ్…అసలు నమ్మలేరు
Care Of anasuya serial actress pavani :ప్రముఖ ఛానల్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న కేరాఫ్ అనసూయ సీరియల్ లో నటీనటులు తమ అందంతో,అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఈ సీరియల్ లో అనసూయకు కూతురిగా, శివానికి చెల్లెలుగా నటిస్తున్న నటి పావని తన నటనతో తొలి సీరియల్ తోనే తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.
నటనతో బుల్లితెరపై తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకుంటున్న పావని అసలు పేరు ప్రియా హెగ్డే. 1994నవంబర్ 24న కర్ణాటక రాష్ట్రములోని ఉడిపిలో జన్మించింది. ఈమెకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. మంగుళూరు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ప్రియా స్టడీస్ పూర్తయ్యాక ఓ కంపెనీలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేసింది.
అయితే చిన్ననాటి నుంచి నటనపై గల ఆసక్తితో మోడలింగ్ వైపు కూడా అడుగులు వేసిన ప్రియా పలు ఫ్యాషన్స్ షోస్ లో పాల్గొంది. యాడ్స్, ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో జిల్క అనే కన్నడ సినిమాలో నటించి పాపులర్ అయింది. తెలుగులో నువ్వే నా ప్రాణం అనే మూవీలో నటిస్తోంది.