చత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడు.. ఏం చేస్తున్నాడో తెలుసా?
Chatrapathi film child artist bhaswanth vamsi :ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినవారు ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిన విషయమే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సూరీడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చత్రపతి సినిమాలో సూరీడు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని సన్నివేశాలలో మాత్రమే కనిపించినా సూరీడు ఆలియా భస్వంత్ వంశీ తన నటనతో ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నాడు కాట్రాజు సన్నివేశంలో భస్వంత్ వంశీ బాగా నటించాడు చత్రపతి సినిమాలో ప్రభాస్ పాత్ర ను ఎలివేట్ చేయడానికి ఈ సన్నివేశం చాలా బాగా సహాయపడుతుంది.
భస్వంత్ వంశీ చత్రపతి సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు ఈ మధ్యనే చదువు పూర్తి చేసుకుని వచ్చిన భస్వంత్ టాలీవుడ్ హీరో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.