కార్తీకదీపం సీరియల్ నటి భాగ్యం రియల్ లైఫ్…అసలు నమ్మలేరు
Karthika Deepam serial bhagyam real life : బుల్లితెరపై నడుస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ప్రసారమవుతూ టాప్ టీఆర్ఫీ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇందులో నటీనటులు తమ నటనతో,అందంతో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఈ సీరియల్ వచ్చే సమయానికి టివిల ముందు జనాలు వాలిపోతున్నారు. ఇక ఈ సీరియల్ లో అర్ధపావు భాగ్యం క్యారెక్టర్ చాలా పాపులర్ అయింది. దీప పిన్ని,మురళీకష్ణ వైఫ్ క్యారెక్టర్ లో నటిస్తున్న భాగ్యలక్ష్మి వివరాల్లోకి వెళ్తే, ఈమె అసలు పేరు ఉమాదేవి.
సెయింట్ మేరీ స్కూల్,అన్నామలై యూనివర్సిటీలలో చదువుకున్న ఉమాదేవికి చిన్ననాటి నుంచి యాక్టింగ్,డాన్సింగ్ అంటే ఇష్టం. స్టడీస్ పూర్తి అయ్యాక యాక్టింగ్ ఫీల్డ్ లో కొనసాగాలని భావించింది. వరూధిని పరిణయం సీరియల్ తో బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో సీరియల్స్ లో నటించిన ఈమెకు 19ఏళ్ల కూతురు ఉంది. ఆమెను కూడా హీరోయిన్ గా చూడాలని ఉమాదేవి భావిస్తోందట.ఎక్కువగా ఫ్యామిలీతో ఉమాదేవి స్పెండ్ చేస్తూ ఉంటుంది. భర్త,పిల్లలు అండగా ఉండడం వలన ఇండస్ట్రీలో ఉంటున్నానని ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పింది.
కార్తీకదీపం సీరియల్ తో పాటు ప్రస్తుతం కల్యాణ వైభోగమే సీరియల్ లో జై కి అక్క పాత్రలో ఉమాదేవి నటిస్తోంది. ప్రేమ ఎంత మధురం సీరియల్ లో కూడా చేస్తోంది. రవితేజ నటించిన ఖతర్నాక్ మూవీలో కూడా ఉమాదేవి టీచర్ వేషం వేసింది. నితిన్ నటించిన సై మూవీలో విలన్ భిక్షు యాదవ్ సరసన నటించింది. గిలిగింతలు,అత్తిలి సత్తిబాబు, అబ్బాయి ప్రేమలో పడ్డాడు,యమదొంగ నేను వంటి మూవీస్ లో నటించింది.అర్జున్ రెడ్డి మూవీలో హాస్పిటల్ సీన్ లో కన్పించింది.