మాస్ట్రో సినిమాలో ఒక్క పాట కోసం ఎంత ఖర్చు పెట్టారో…?
maestro movie : జయం మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి, బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో నితిన్ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఈ మధ్య కొన్ని ప్లాప్ లు ఎదుర్కొన్నప్పటికీ కరోనాకు ముందు భీష్మ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. తాజాగా డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న మాస్ట్రో సినిమాలో హీరోగా చేస్తున్నాడు.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాదున్‌కు రీమేక్ గా వస్తున్న ఈ మూవీలో నితిన్‌కు నభా నటేశ్ జోడీ కడుతోంది. హిందీలో’టబు’ చేసిన పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మూవీలో ముఖ్యమైన పాత్రలు పోషించిన నటీనటులపై హైదరాబాద్‌లో ప్రత్యేకంగా భారీ సెట్ వేసి మరీ ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేశారట. ఈ ఒక్క పాట కోసమే దాదాపు రూ. 50 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. సినిమా ప్రమోఫన్స్లో ముఖ్యంగా ఈ పాటనే వాడతారట. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా త్వరలో రిలీజ్ చేస్తారట.