రణం సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?
Gopichand Ranam Movie :గోపీచంద్ నటన, కామ్నా జఠ్మలానీ గ్లామర్ కలగలసిన రణం మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. విలన్ ని కిక్కెక్కిస్తూ కామెడీ, మోషన్ పండిస్తూ హీరో చేసిన విన్యాసాలు, అలీ పై చిత్రీకరించిన బుల్లి గౌను వేసుకునే సాంగ్ సంచలనమైంది. 2006 ఫిబ్రవరి 10న రిలీజైన ఈ మూవీని అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.
గోపీచంద్ కెరీర్ లో మంచి హిట్ ఇచ్చిన మూవీ ఇది. ఈ సినిమాకు ముందు జనవరి 27న వచ్చిన అల్లు అర్జున్ హ్యాపీ మూవీ ఎబో ఏవరేజ్ అయింది. జెనీలియా హీరోయిన్. యవన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. దీంతో పాటే శ్రీకాంత్,రాజేంద్రప్రసాద్ నటించిన సరదా సరదాగా మూవీ వచ్చింది.అయితే ఇది పెద్దగా ఆకట్టుకోలేదు.
అలాగే జనవరి 27నే పార్టీ మూవీ రిలీజయింది. రవిబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అల్లరి నరేష్,బ్రహ్మానందంకీలక పాత్రలు పోషించారు.కామెడీతో కూడిన ఈ మూవీ ఏవరేజ్ గా నిల్చింది. ఇక రణంకి ఒక్కరోజు ముందు మాస్ మహారాజ్ రవితేజ నటించిన షాక్ మూవీ వచ్చింది. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీని హరీష్ శంకర్ డైరెక్ట్ చేసాడు. ఈమూవీలో జ్యోతిక హీరోయిన్. అయితే ఈ మూవీ ఎవెరెజ్ అయింది.
ఇక ఫిబ్రవరి 16న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అసాధ్యుడు మూవీ రిలీజయింది. కథలోబలం లేకపోవడం,హీరోయిన్ మైనస్ కావడంతో ఫెయిల్యూర్ ని చూడాల్సి వచ్చింది.ఫిబ్రవరి 17న యాక్షన్ కింగ్ అర్జున్, డైనమిక్ హీరో జగపతి బాబు కల్సి నటించిన శివకాశి మూవీ రిలీజయింది. అర్జున్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో విడుదలైంది. అయితే ఈ సినిమా తమిళంలో ఏవరేజ్ అయింది. తెలుగులో మాత్రం ఫెయిల్ అయింది.
ఇక రణం మూవీకి రెండు వారాల గ్యాప్ తో డాక్టర్ రాజశేఖర్ నటించిన రాజబాబు విడుదలైంది. బ్రహ్మానందం,కోవై సరళ ల కామెడీ,ధర్మవరం ట్రూప్ నుంచి వచ్చిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా ఎబో ఏవరేజ్ అయింది.