కస్తూరి,ఆమని మధ్య రిలేషన్ ఏమిటో తెలుసా
Actress Kasthuri and Aamani : గృహాలక్ష్మి సీరియల్ తులసి క్యారెక్టర్ లో నటిస్తూ ఆడియన్స్ నుంచి ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న నటి కస్తూరికి ఫాన్ ఫాలోయింగ్ వీరలెవెల్లో ఉంది. పైగా ఈ సీరియల్ కాన్సెప్ట్ నచ్చడంతో బుల్లితెర ఆడియన్స్ ఆదరణ బాగా చూరగొంటూ మంచి టీఆర్ఫీ రేటింగ్ తో నడుస్తోంది. ఈమె సీరియల్స్ లోకి రాకముందు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా కస్తూరి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన జంబలికడిపంబ మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమని ఆతర్వాత ఎన్నో హిట్ మూవీస్ చేసి, మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక మిస్టర్ పెళ్ళాం మూవీకి జాతీయ ఫిలిం అవార్డు అందుకుంది. ఉత్తమ నటిగా నంది అవార్డు సైతం దక్కింది.
పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా జరిగిన ఆమని, 2003తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోంది. అయితే ఆమని, కస్తూరి మంచి ఫ్రెండ్స్. ఆమనితో గల ఫోటోని కస్తూరి ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. అన్నమయ్యలో కస్తూరి నటన అంటే ఆమనికి చాలా ఇష్టమట. ఈ సినిమాయే మమ్మల్ని ఫ్రెండ్స్ గా చేసిందని కస్తూరి ఇటీవల వెల్లడించింది. ఇద్దరూ రెగ్యులర్ గా కలుసుకుంటూ ఉంటారు. ఆమని కూడా ఈ మధ్య సీరియల్ లో ఎంట్రీ ఇచ్చింది.