స్టార్ హీరోలు మెళుకువలు ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా?
Tollywood Heroes :రాజకీయాల్లో కింగ్ మేకర్ ఎలాగో టాలీవుడ్ లో స్టార్ మేకర్స్ కూడా ఉన్నారు. అవును, చాలామంది హీరోలకు అతడు ఇచ్చిన శిక్షణ బాగా దోహదం చేసింది. దాదాపు వంద మంది హీరోలకు అతడు శిక్షణ ఇచ్చాడు. అతడే సత్యానంద్.ఇతడి దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్లలో 70శాతం మంది సినిమాల్లో హీరోలుగా,నటీనటులుగా రాణిస్తున్నారు. కొందరు టాప్ హీరోలుగా విరాజిల్లుతున్నారు. ఇక తన శిక్షణ సంస్థలో ఎవరిని పడితే వాళ్ళను ఈయన చేర్చుకోడు.
సత్యానంద్ కి సినిమాల్లో కూడా నటించిన అనుభవం ఉంది. ఒక క్రిమినల్ ప్రేమకథ మూవీలో మావయ్య పాత్రలో మెరిసిన సత్యానంద్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికర అంశాలు చెప్పడం విశేషం. నటనకు కావాల్సిన మినిమమ్ క్వాలిఫికేషన్స్,ఇంట్రెస్ట్ లేకుంటే అస్సలు తమ ఇనిస్టిట్యూట్ లో చేర్చుకునేది లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. పరీక్షించాకే శిక్షణకు అనుమతి ఇస్తామని చెప్పారు.
సమయం, డబ్బు వృధా చేయడం ఇష్టం ఉండదని, అందుకే శిక్షణకు ముందే అన్నీ ఆలోచించి చేర్చుకుంటామని సత్యానంద్ చెప్పాడు. తాజాగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి కూడా నటనలో మెళుకువలు నేర్పిన ఘనత సత్యానంద్ కే దక్కుతుంది. వాస్తవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు,యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలకు నటనలో శిక్షణ ఇచ్చిన సత్యానంద్ స్టార్ మేకర్ కి సరైన నిర్వచనంగా చెప్పొచ్చు.