ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా….అవకాశాల కోసమా…?
Tollywood Heroine sadaa :సెలబ్రిటీలకు సోషల్ మీడియా మంచి వేదిక అయింది. ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండడం వలన వీళ్ళు పెట్టె పోస్టులు, షేర్ చేసే ఫోటోలు తెగ వైరల్ అవుతాయి. జయం మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ హోదా దక్కించుకుంది హీరోయిన్ సదా. ఆతర్వాత తమిళంలో విక్రమ్ సరసన అపరిచితుడు వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో హీరోయిన్ గా నటించి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది.
తెలుగులో దొంగ దొంగది,చుక్కల్లో చంద్రుడు, అవునన్నా కాదన్నా, శంకర్ దాదా జిందాబాద్ వంటి మూవీస్ లో నటించిన సదా తర్వాత కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరం జరిగింది.మళ్ళీ ఇప్పుడు రీ ఎంట్రీ కోసం ట్రై చేస్తున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలను బట్టి తెలుస్తోంది.
స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోలను సదా తన అధికారిక ఇష్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. వావ్ అంటూ కామెంట్స్ తో దుమ్మురేపు తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసే ఈ అమ్మడు స్విమ్ సూట్ లో స్వమ్మింగ్ పూల్ లో ఈతకొడుతూ బోల్డ్ గా కనిపించడంతో పాటు హలొ సండే అనే టాగ్ తగిలించింది. మరి రీ ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.