అదుర్స్ సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?
Jr NTR Adhurs Movie : స్టూడెంట్ నెంబర్ వన్ తో జూనియర్ ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందిస్తే, ఆది మూవీతో వివి వినాయక్ కూడా బ్లాక్ బస్టర్ అందించాడు. అలాగే వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన అదుర్స్ మూవీ కూడా మంచి హిట్ అందుకుంది. కామెడీ,యాక్షన్ మేళవించిన ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ డబుల్ రోల్ చేసాడు. 2010 జనవరి 13న రిలీజైన ఈ మూవీ లో బ్రాహ్మణుడి క్యారెక్టర్ లో అదరగొట్టాడు తారక్. ఇక నయనతార, బ్రహ్మానందం కామెడీ ట్రాక్ అదిరిపోయింది. దేవిశ్రీ సాంగ్స్ సూపర్ హిట్. అన్నీ కుదిరిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదుర్స్ అనిపించుకుంది.
అదుర్స్ రిలీజ్ రోజునే నవదీప్ నటించిన ఓం శాంతి మూవీ రిలీజయింది. ఇది పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే అదుర్స్ రిలీజ్ సమయానికి ఒకరోజు తర్వాత అంటే జనవరి 14న విక్టరీ వెంకటేష్ నటించిన నమో వెంకటేశ మూవీ రిలీజయింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో త్రిష హీరోయిన్. లవ్ ,కామెడీ తో వచ్చిన ఈ మూవీ ఎబో ఏవరేజ్ అయింది. అదేరోజున మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శంభో శివశంభో మూవీ రిలీజయింది. సముద్రగని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అల్లరి నరేష్ తదితరులు నటించిన ఈ మూవీ పెద్దగా అలరించలేదు.
అదుర్స్ కి 9 రోజుల గ్యాప్ లో నితిన్ నటించిన సీతారాముల కళ్యాణం లంకలో మూవీ రిలీజయింది. అప్పటికే ప్లాప్స్ లో ఉన్న నితిన్ కి ఈ మూవీ కూడా నిరాశ మిగిల్చింది. హన్సిక హీరోయిన్ గా చేసింది. ఇక అదుర్స్ కి 12రోజుల ముందు జగపతిబాబు నటించిన మానాన్న చిరంజీవి మూవీ రిలీజయింది. ఎలాంటి పోటీ ఇవ్వకుండానే అదుర్స్ కి ముందే చతికిలబడింది. మొత్తానికి అదుర్స్ తన సత్తా చాటింది.