శ్రీకాంత్ హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Tollywood Actor gayathri jayaraman :మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన మూవీ కరోనా సెకండ్ వేవ్ కి ముందు థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపొయింది. అంత గొప్పగా ఈ సినిమాలో నటించి, తొలిసినిమాతోనే స్టార్ డమ్ తెచ్చుకుంది.
దీంతో కృతికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఉప్పెనలో కృతి తల్లి పాత్రలో నటించిన గాయత్రీ జయరామన్ తక్కువ నిడివి గల పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈమె కూడా ఒకప్పటి హీరోయిన్ కావడం విశేషం. శ్రీకాంత్ నటించిన ఆడుతూ పాడుతూ మూవీలో గాయత్రిగా నటించింది. ఈ మూవీ 2002లో రిలీజయింది.
ఆతర్వాత నాయుడు ఎల్ ఎల్ బి మూవీలో కూడా గాయత్రీ జయరామన్ నటించినప్పటికీ హీరోయిన్ గా బ్రేక్ రాలేదు. 2007లో పెళ్లిచేసుకున్న ఈమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అన్నట్టు కాన్సర్ బారిన పడ్డ లేడీ సింగర్ కథనంతో కన్నడంలో తెరకెక్కిన నీలా మూవీతో గాయత్రీ జయరామన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.