అగ్ర నటులకు సైతం కండీషన్స్ అప్లై చేస్తున్న హీరోయిన్…ఎవరో…?
Tollywood Heroine Nayanatara :సాదరణంగా పెద్ద హీరోలతో ఛాన్స్ వస్తే సదరు హీరోయిన్స్ ఎగిరి గంతేస్తారు. వారి పక్కన నటిస్తే చాలునని ఎంతోమంది ఆశపడతారు. ఆ కోరిక తీరని వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే అలాంటి అగ్ర నటులు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ పక్కన నటించడానికి స్టార్ హీరోయిన్ నయనతార ఎన్నో కండీషన్లు పెట్టిందట.
నిజానికి ముట్టుకోకుండా పక్కన యాక్ట్ చేయాలని, సినిమా ప్రమోషన్స్ వాటికి దూరంగానే ఉంటానని కరాఖండీగా చెప్పే అలవాటు నయనతారకు ఉంది. అయితే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ మూవీస్ లో నటించడానికి కూడా ఇవే కండీషన్లు అమలు చేసిందట. వెంకీతో బాబు బంగారం, మెగాస్టార్ తో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (సైరా) మూవీస్ కి ఒకే చెప్పినపుడు తన కండీషన్లు కూడా చెప్పేసిందట.
దాంతో ఇక ఏమీ చేయలేక సరేనని ఒప్పుకోక తప్పలేదట. అయితే షూటింగ్ కి ఆలస్యంగా రావడం వలన సైరా మూవీ జాప్యం జరిగిందని, డైరెక్టర్ సురేంద్రరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి కూడా నయనతారపై కోప్పడ్డారట. అయినా నయన్ ఇప్పటికీ ఇవే కండీషన్స్ ఫాలో అవుతోంది. ఆమె రేంజ్ అలా ఉంటె ఎవరైనా ఏమీ చేయలేరు కదా అని కొందరు అంటుంటే, ఇలా ఉంటె ఇబ్బందేమిటని ఆమె ఫాన్స్ అంటున్నారు.