MoviesTollywood news in telugu

యాంకర్ అనసూయ రియల్ లైఫ్…ఎన్ని కోట్ల అస్థి….?

Tollywood Tv Anchor Anasuya Bharadwaj :ఓపక్క యాంకర్ గా,మరోపక్క సినిమా స్టార్ గా ఎక్కువ ఫాన్ ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న అనసూయ అసలుపేరు అనసూయ భరద్వాజ్. అను అనసూయ అని పిలుస్తుంటారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో సుదర్శనరావు,అనూరాధ దంపతులకు 1985మే 15న పుట్టిన ఈమెకు ప్రస్తుతం 36ఏళ్ళు. ఈమెకు అంబికా,వైష్ణవి అనే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. స్టడీస్ సమయంలో ఎన్సీసీ లో ఉండగా,శశాంక్ భరద్వాజ్ పరిచయం కావడం,అది ప్రేమకు దారితీయడంతో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు సౌర్య భరద్వాజ్, అయాన్ భరద్వాజ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సెయింట్ మేరీస్ స్కూల్,భద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ లో స్టడీస్ పూర్తిచేసిన అనసూయ ఎంబీఏ పాసయ్యింది. ఓ కంపెనీలో హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న సమయంలో ఫోటో షూట్స్ చేసేది. ఆ సమయంలోనే మోడలింగ్ లో ఛాన్స్ వస్తే, అందులోకి ప్రవేశించింది. తర్వాత సాక్షి టివిలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. సెలబ్రిటీలను ఇంటర్యూ చేసేది. ఇక జబర్దస్త్ షో ఓ యాంకర్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఆమె రూట్ మారిపోయింది. భారీ ఫాన్ ఫాలోయింగ్ వచ్చింది. 2002లో నాగ మూవీలో చేసింది. అలాగే సోగ్గాడే చిన్ని నాయనే, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో చేసిన ఈమె ఖిలాడీ లో కూడా చేసింది. ఇది త్వరలో రిలీజ్ కానుంది.

జబర్దస్త్ లో యాంకరింగ్ కి మొదట్లో 10వేలు వచ్చేదట. ఇప్పుడు ఒక్కో షోకి 70నుంచి 90వేలు అందుకుంటోంది. మూవీస్ కి 2లక్షల వరకూ వస్తోంది. ఈమె 5అడుగుల 8 అంగుళాలు ఉంటుంది. బరువు 69కిలోలు. ఈమెకు మాల్దీవులు అంటే ఇష్టమైన ప్రదేశం. కుకింగ్, వర్కౌట్స్ హాబీస్. చిరంజీవి, నాగార్జున అంటే ఇష్టమైన హీరోలు. అనుష్క, సమంత ఇష్టమైన హీరోయిన్స్. ఈమె నెట్ వర్త్ 10కోట్లు ఉంటుందట. మణికొండలో 2కోట్లు విలువచేసే ఇండివిడ్యువల్ హౌస్ లో ఉంటోంది. ఈమెకు రెండు కార్లున్నాయి.