రకుల్ హౌస్ విలువ ఎన్నికోట్లో తెలిస్తే షాక్ అవుతారు
Heroine rakul preet singh hyderabad house cost :ఈమధ్య స్టార్ సెలబ్రిటీలు ఖరీదైన కార్లు,వస్తువులు కొంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుని పనిలో నిమగ్నమయ్యారు. కొందరు సినిమాల్లో వచ్చే సంపాదనను వేరే రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మరికొందరు చక్కని ఇంటిని సమకూర్చుకుంటున్నారు.తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంద్రభవనం లాంటి ఇల్లు కొనుక్కుందట
వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా పలు యాడ్స్ లో కూడా చేస్తోంది. క్రిష్ డైరెక్షన్ లో మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా నటించే సినిమాలో రకుల్ నటిస్తోంది. ఉప్పెన మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ రెండో సినిమా పక్కా ప్లాన్ తో చేస్తున్నాడు.
ఇక బాలీవుడ్ లో కూడా రకుల్ రెండు సినిమాలు చేస్తోంది. ఇలా తెలుగులోనే కాకుండా తమిళ,హిందీ భాషల్లో కూడా నటిస్తూ బిజీ అయింది. దీంతో ఓపక్క ముంబయిలో మరోపక్క హైదరాబాద్ లో ఉండాల్సి రావడంతో హైదరాబాద్ లో సొంత ప్లాట్ అప్పట్లోనే సమకూర్చుకుంది. దీని ఖరీదు 5కోట్లు అని టాక్. సకల సౌకర్యాలతో ఈ ప్లాట్ ఉంటుందట.