తెలుగు సిరియల్స్ తో పాపులర్ అయినా టాప్ కన్నడ హీరోయిన్స్
popular Telugu serial heroines from Kannada :వెండితెరపై ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్స్ ఎలా నటిస్తున్నారో అలాగే బుల్లితెరపై కూడా ఇతర భాషలకు చెందినవాళ్లు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ముఖ్యంగా కన్నడ అమ్మాయిలు తెలుగు బుల్లితెరపై నటిస్తూ,అచ్చం తెలుగు అమ్మాయిల్లా తమ నటనతో ఆడియన్స్ కి దగ్గరవుతున్నారు. గుప్పెడంత మనసు హీరోయిన్ రక్షా గౌడ, కల్యాణ వైభోగమే సీరియల్ హీరోయిన్ మేఘన లోకేష్, కేరాఫ్ అనసూయ హీరోయిన్ తేజస్విని, కస్తూరి సీరియల్ ఫేమ్ ఐశ్వర్య, నాపేరు మీనాక్షి సీరియల్ హీరోయిన్ నవ్యస్వామి కన్నడ వాళ్ళే.
ఇక కార్తీక దీపం సీరియల్ ఫేమ్ ప్రేమీ విశ్వనాధ్,శోభా శెట్టి , అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు ఫేమ్ చైత్రా రాయ్, త్రినయని సీరియల్ ఫేమ్ హాషిక, సూర్యకాంతం సీరియల్ ఫేమ్ ఆంశిక,నెంబర్ వన్ కోడలు సీరియల్ ఫేమ్ మధుమిత, ప్రేమ ఎంత మధురం సీరియల్ వర్ష, కుంకుమ పువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి, బంగారు గాజులు ఫేమ్ నక్షత్ర, గుండమ్మ కథ సీరియల్ ఫేమ్ పూజామూర్తి, నిన్నే పెళ్ళాడతా సీరియల్ ఫేమ్ భూమి శెట్టి, మధుబాల కూడా కన్నడం నుంచి వచ్చినవాళ్లే.
అంతేకాదు,అమ్మ నా కోడలా సీరియల్ ఫేమ్ నిత్య,రామచక్కని సీరియల్ ఫేమ్ నవ్య, రామసీత సీరియల్ ఫేమ్ కీర్తి, అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ ఫేమ్ కావ్యశ్రీ, జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ ప్రియాంక, బంగారు పంజరం సీరియల్ ఫేమ్ నిఖిత కూడా కన్నడం వాళ్ళే అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిలుగా తెలుగు టివి ఛానల్స్ లో వచ్చే సీరియల్స్ లో నటిస్తూ రాణిస్తున్నారు