మెగాస్టార్ తో నటించడానికి ఈ హీరోయిన్ ఎంత డిమాండ్ చేసిందో తెలుసా ?
Chiranjeevi new movie :సినిమాల్లో మెగాస్టార్ గా ఎదిగి, రాజకీయాల్లో చేరి కేంద్రమంత్రిగా పనిచేసిన చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి అదే స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. వరుస సినిమాలతో బిజీ అయ్యారు. సైరా మూవీ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో ప్రస్తుతం ఆచార్య మూవీ చేస్తున్నారు. ఇది దాదాపు పూర్తికావచ్చింది. ఇక విడుదల చేయడమే తరువాయి.
అలాగే ఒక హీరో, అభిమాని మధ్య వుండే అనుబంధాన్ని వివరిస్తూ బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేయడానికి చిరంజీవి రెడీ అవుతున్నారు. ఇందులో అభిమాని పాత్రలో ఓ యంగ్ హీరోని వెతికే పనిలో పడ్డారు. ఇక హీరోయిన్ వేటలో భాగంగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను అడిగి,కథ వివరిస్తే,ఏకంగా మూడున్నర కోట్లు డిమాండ్ చేసిందట. ఒక్క పైసా కూడా తగ్గేది లేదంటూ తేల్చి చెప్పేసిందట.
ఇది ఇందులో నిజమెంతో గానీ ఈ వార్త వైరల్ అవుతోంది. కాగా మలయాళంలో హిట్ కొట్టిన లూసిఫర్ మూవీని రీమేక్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇందులో మెగాస్టార్ హీరో. అలాగే తమిళంలో హిట్ కొట్టిన వేదాళం మూవీని మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేయడానికి మెగాస్టార్ ఒకే చేసారు.