MoviesTollywood news in telugu

జబర్దస్త్ కామెడీ షో పవిత్ర గురించి నమ్మలేని నిజాలు ..ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

Jabardasth Pavithra :తెలుగు బుల్లితెరపై టాప్ కామెడీ షో గా నడుస్తున్న ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రాం ఇప్పటికీ అదే రేటింగ్ తో దూసుకుపోతోంది. అయితే ఒకప్పుడు లేడి క్యారెక్టర్స్ వేయడానికి ఈ షోకి ఎవరూ వచ్చేవారు కాదు, అందుకే పురుషులే లేడి గెటప్స్ తో అలరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. స్కిట్ పరంగా తిట్టడం, కొట్టడం చేయాల్సి వస్తుంది.

అందుకే అమ్మాయిలు ఉంటె ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశ్యంతో అబ్బాయిలే లేడీ గెటప్స్ లో కనిపించేవారు. కానీ కొన్ని నెలలుగా జబర్దస్త్ లో అబ్బాయిలకు పోటీగా అమ్మాయిలు వస్తున్నారు. చంద్ర టీమ్ లో సత్య అనే అమ్మాయి ఉండేది. పటాస్ షోతో ఫేమస్ అయిన వర్ష, అలాగే పవిత్ర అనే నాలుగడుగుల ఎత్తుగల అమ్మాయి వేసే డైలాగులు పేలుతున్నాయి.

హైపర్ ఆది, భాస్కర్, వెంకీస్ మంకీస్ ప్రతి టీమ్ లో పవిత్ర కన్పిస్తోంది. రాఘవతో కల్సి పవిత్ర చేసిన స్కిట్ లో కామెడీ అదిరిపోతోంది. పంచ్ డైలాగులు పేలుతున్నాయి. దీంతో ఈమె గురించే సెర్చ్ చేస్తుంటే, ఈమె చాలా టిక్ టాక్ షోస్, సీరియల్స్ లో చేసింది. అయితే జబర్దస్త్ షో కి వచ్చాక టాప్ రేంజ్ లో దూసుకెళ్తోంది.