మిల్కీ బ్యూటీకి ఇష్టమైన వంటకాలు ఏమిటో తెలుసా?
Milky beauty tamannah favourite dishes : ఎస్ ఎస్ రాజమౌళి భారీ వ్యయంతో తెరకెక్కించిన బాహుబలి ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు. ప్రభాస్,అనుష్క,సత్యరాజ్, రానా, రమ్యకృష్ణ ఇలా చాలామందికి ఈ మూవీతో మంచి పేరు వచ్చింది. ఇక ఇందులో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారింది.
శ్రీ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తమన్నా హ్యాపీ డేస్ మూవీతో మంచి హిట్ అందుకుంది. ఇక ఈమె పని అయిపోయిందన్న ప్రతిసారీ ఏదోఒక సినిమా హిట్ తో మళ్ళీ పుంజుకుంటోంది. స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తోంది. సరిలేరు నీకెవ్వరూ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసి అభిమానుల్ని అలరించింది. ప్రస్తుతం తమన్నా చేస్తున్న సినిమాలు హిట్ కొడితే రెండేళ్లవరకూ తిరుగుండదు.
ఈమె నటించిన మాస్ట్రో మూవీ త్వరలోనే ఓటిటి లో రిలీజ్ కాబోతోంది. అలాగే ఎఫ్ 3, సిటీమార్, గుర్తుందా శీతాకాలం మూవీస్ కూడా చేస్తోంది. ఇక వెబ్ సిరీస్ లో కూడా చేయడానికి ఒకే చెబుతోంది. ఇక మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంకి చెఫ్ గా వ్యవహరించి,తెలుగు రాష్ట్రాల వంటకాల గురించి తెలుసుకుంది.ఈమెకు హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టమట. ముఖ్యంగా ఆవకాయ్, పూతరేకులు అంటే కూడా చాలా ఇష్టమని చెబుతోంది.