గుప్పెడంత మనసు సీరియల్ నుండి రాజీవ్ తప్పుకోవటానికి కారణం ఇదే
Guppedantha Manasu serial gopalshyam : తెలుగులో టాప్ రేటింగ్ తో నడుస్తున్న కార్తీకదీపంతో సమానంగా రేటింగ్, ఆడియన్స్ అభిమానం చూరగొన్న సీరియల్ గా గుప్పెడంత మనసు సీరియల్ పేరుతెచ్చుకుంది. ఈ సీరియల్ మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే బుల్లితెర ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో నటించే నటీనటులు తమ అందంతో,నటనతో ఆడియన్స్ మదిని దోచారు.
చిన్నప్పుడు కొడుకుని వదిలి తల్లి వెళ్లిపోవడం, మళ్ళీ తల్లీ కొడుకులు ఎప్పుడు ఎలా కలుస్తారా అనే కోణంలో సీరియల్ నడుస్తోంది. అలాగే హీరోయిన్, హీరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అనే అంశంపై చర్చ సాగుతొంది. ఇక ఈ సీరియల్ లో మొదట్లో కన్పించిన నటులు కొందరు ఇప్పుడు కనపడ్డం లేదు. ఈ సీరియల్ పరంగా వాళ్ళు ఇక అవసరం లేదని తప్పుకున్నట్లు తెలుస్తోంది.
హీరో, హీరోయిన్స్ తో పాటు విలన్ కి కూడా అంతేపేరు వస్తుంది. ఇక కొన్ని రోజులుగా గుప్పెడంత మనసు సీరియల్ లో విలన్ రాజీవ్ కన్పించడం లేదు. హెల్త్ బాగోలేదని, వేరే సీరియల్ లో నటించడం వలన ఇది వదిలేసాడని ఇలా రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే హీరో,హీరోయిన్ పెళ్ళికి దగ్గరపడ్డంతో విలన్ రాజీవ్ క్యారెక్టర్ అవసరం ఉండదు. అందుకే ఈ క్యారెక్టర్ ముగిసింది. ఇతడి అసలు పేరు గోపాల్ శ్యాం.