ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోని గుర్తు పట్టారా…?
Kamal hasan Child Hood Photoes :స్టార్ సెలబ్రిటీల కు సంబంధించి వెరైటీ ఫోటోలు ఉంటె విపరీతంగా వైరల్ అవుతుంటాయి. వారికున్న సినిమా క్రేజ్ అలాంటిది. ప్రస్తుతం సౌత్ ఇండియా సూపర్ స్టార్ కమల్ హాసన్ చిన్నప్పటి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 20ఏళ్ళ వయస్సులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి,తమిళ, తెలుగు,హిందీ తదితర భాషల్లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుని అగ్ర నటుడయ్యాడు.
విభిన్న తరహా పాత్రలు పోషించిన ఘనత కూడా కమల్ దక్కించుకున్నాడు. దశావతారం మూవీలో ఏకంగా 10విభిన్న పాత్రలతో అలరించాడు. ఫైట్స్, డాన్స్ లలో వైవిధ్యం కనబరుస్తుంటాడు. మొదట్లో వాణీ గణపతిని పెళ్ళిచేసుకుని, తర్వాత సారికను పెళ్లాడాడు. తర్వాత గౌతమితో సహజీవనం చేసి, ఇప్పుడు ఆమెతో కూడా విడిపోయాడు. 62ఏళ్ళ వయస్సులో కూడా యంగ్ హీరోలకు ధీటుగా నటిస్తూ అలరిస్తున్నాడు.
అయితే రాజకీయాల్లోకి కూడా వచ్చినప్పటికీ ఆకట్టుకోలేక పోయాడు. ఇక కమల్ హాసన్ బాల నటుడుగా కూడా సినిమాల్లో నటించాడు. 4 సంవత్సరాల వయస్సులో కళధూర్ కణ్ణమ్మ మూవీలో నటించిన కమల్ నటన చూసి అప్పట్లో సావిత్రి జెమిని గణేశన్ సైతం ఆశ్చర్యపోయారట. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించాడు. కాగా ఇతడి అసలు పేరు పార్ధసారధి. పార్ధు అని ముద్దుగా పిలిచేవారట.చిన్నప్పటి ఫోటోలు వైరల్ కావడంతో ఫాన్స్ ఖుషీ అవుతున్నారు.