MoviesTollywood news in telugu

వచ్చే సంక్రాంతి బరిలో విజేతగా నిలిచే మూవీ ఎవరిదో…?

Who Is The Sankranthi Winner :తెలుగింట సంక్రాంతి పండగ వస్తోందంటే ఆ సందడే వేరు. ఎన్నో రకాల సందడి ఈ పెద్ద పండుగలో కనిపిస్తుంది. అందులో సినిమాల విడుదల కూడా ఒకటి. సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల్లో పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల మూవీస్ కూడా ఉంటాయి. వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ లో అన్నీ పెద్ద హీరోల సినిమాలే ఎక్కువ కన్పిస్తున్నాయి. మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట,ప్రభాస్ నటించిన రాధేశ్యాం, పవన్ కళ్యాణ్,రానా సినిమా, వెంకీ నటిస్తున్న ఎఫ్ 3 సినిమాలు ఈ సంక్రాంతి కి రిలీజ్ కానున్నాయి.

ఒకేసారి ఇలా పెద్ద హీరోల సినిమాలు వచ్చేస్తే, టాలీవుడ్ కి నష్టమని పలువురు సినీ విశ్లేషకుల అంచనా. గతంలో ఇన్ని సినిమాలు లేవని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి వస్తుంటే, సినీ పెద్దలు కూర్చుని సర్దిచెప్పేవారు. ఈసారి అందుకు భిన్నంగా పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా కరోనా కారణంగా సినిమాల రిలీజ్ వాయిదా పడడంతో నిర్మాతలు అర్హ్దిక భారం మోయలేకపోతున్నారు. అందుకే ఒకేసారి సినిమాలు పోటెత్తుతున్నాయి.

ముందుగా సర్కారువారి పాట మూవీ రిలీజ్ గురించి మహేష్ బాబు ప్రకటించగా, తర్వాత ఒకరి తర్వాత ఒక హీరో తమ సినిమాల రిలీజ్ గురించి ప్రకటనలు చేసారు. అయితే బడా నిర్మాత దిల్ రాజుని ఎఫ్ 3వాయిదా వేయాల్సిందిగా కొందరు ప్రతిపాదన చేశారట. అయితే ఎఫ్ 2సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టింది. మరి ఎఫ్ 3 సంక్రాంతి బరిలో వద్దంటే సెంటిమెంట్ కాదనుకుంటారా? అందుకే దీనిపై వెంకీ,దిల్ రాజు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.