రాత్రి ఒక్కసారి రాస్తే చాలు ఉదయానికి నొప్పులు అని మటుమాయం
Home remedies for body pain In telugu : శరీరంలో ఎక్కడైనా నొప్పులు ఉంటే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం.పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల దీర్ఘ కాలికంగా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సహజసిద్ధంగా మన ఇంటిలో సులభంగా ఉన్న వస్తువులను ఉపయోగించి తగ్గించుకోవటానికి ఈరోజు కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
పుదీనా ఆకులను తీసుకొని బాగా కడిగి ఒక గ్లాసు నీటిలో వేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల పుదీనా ఆకులోని పోషకాలు అన్ని నీటిలో చేరతాయి. ఈ నీటిని వడగట్టుకుని రాత్రి పడుకోవడానికి ముందు తాగాలి.పుదీనా ఆకులలో ఉండే మెంథాల్ కండరాలను సడలించి నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది.
నీటిని వడకట్టిన తర్వాత ఉడికిన పుదీనా ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులలో ఒక స్పూన్ సొంఠి పొడి, ఒక స్పూన్ పంచదార పొడి, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని. నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి ఒక క్లాత్ తో కట్టాలి. ఈ విధంగా రాత్రి సమయంలో చేసే ఉదయం ఆ. కట్టు తీసేస్తే ఒకటి రెండు రోజుల్లోనే నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.