టాలీవుడ్ ఫ్యామిలీ మల్టీస్టారర్స్…ఎన్ని ఉన్నాయో తెలుసా?
Tollywood Family Multistarers: ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి హీరోలు కూడా ముందుకొస్తున్నారు. అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు.
మెగా ఫ్యామిలీ విషయానికొస్తే ఆచార్య సినిమాలు తండ్రి కొడుకులు అయిన చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు.చిరంజీవి, నాగబాబు కొన్ని సినిమాల్లో కలిసి నటించినా.. నిజ జీవిత పాత్రలైన అన్నాదమ్ములుగా మాత్రం నటించలేదు.మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కలిసి నటించలేకపోయినా.. గెస్ట్లుగా మాత్రం ‘మగధీర’,‘బ్రూస్లీ’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
దగ్గుబాటి ఫ్యామిలీ విషయం కొస్తే వెంకి మామ సినిమాలో వెంకటేష్ నాగ చైతన్య మామ అల్లుడుగా నటించారు. ప్రేమమ్ సినిమాలో కూడా వెంకటేష్ నాగచైతన్య కలిసి నటించారు. ఇక వెంకటేష్,రాణా బాబాయ్ అబ్బాయిలు గా సినిమా చేయబోతున్నారు ఈ సినిమాకి వెంకీ బాబాయి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు దృశ్యం 2 లో కూడా రానా కథను కీలకమైన మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి వెబ్ సిరీస్ లో కూడా నటించడానికి ప్లాన్ చేస్తున్నారట.
అక్కినేని ఫ్యామిలీ విషయానికొస్తే ప్రేమమ్ సినిమాలో నాగార్జున నాగచైతన్య తండ్రి కొడుకులుగా చేశారు. నాగచైతన్య సమంత పెళ్లయ్యాక మజిలీ సినిమా చేశారు. నాగార్జున మాత్రం అమలతో పెళ్లి అయ్యాక ఏ సినిమా చేయలేదు. నాగార్జున తండ్రి నాగేశ్వర రావుతో కలిపి కలెక్టర్ గారి అబ్బాయి అగ్నిపుత్రుడు ఇద్దరూ ఇద్దరే సినిమాల్లో నటించాడు. మనం సినిమాలో నాగార్జున నాగేశ్వరరావు నాగ చైతన్య అఖిల్ అమల ఇలా అందరూ నటించారు
నందమూరి హీరోల విషయానికి వస్తే ఎన్టీఆర్ బాలకృష్ణ హరికృష్ణ తాతమ్మకల సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ బాలయ్య అక్బర్ సలీం అనార్కలి శ్రీమద్విరాటపర్వం సినిమాలలో తండ్రి కొడుకులు గా నటించారు. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ అన్న హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ తో కలిసి నటించాడు
ఘట్టమనేని ఫ్యామిలీ విషయానికొస్తే కృష్ణ మహేష్ బాబు శంఖారావం కొడుకు దిద్దిన కాపురం రాజకుమారుడు తండ్రి కొడుకులు గా నటించారు. మహేష్ బాబు తన అన్న రమేష్ బాబు తో కూడా కలిసి నటించారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా పెళ్లి తర్వాత విజయనిర్మలతో కలిసి చాలా సినిమాలు చేశారు
మోహన్ బాబు తన కొడుకులతో పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో నటించాడు ఈ సినిమాలో మంచు లక్ష్మి కూడా నటించింది.