దివ్యవాణి హీరోయిన్ అవ్వటానికి కారణం ఆ హీరోయిన్…?
Tollywood Heroine divyavani :సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరో ఒకరు ప్రేరణ కావాలి. అప్పుడే సినిమా రంగంలో అడుగుపెట్టడానికి ట్రైల్స్ మొదలవుతాయి. ఛాన్స్ లు వచ్చాక అదృష్టాన్ని బట్టి నిలబడతారు. లేకుంటే అవుట్ అవుతారు. అయితే అడవిలో అర్ధరాత్రి మూవీలో సెలెక్ట్ అయిన దివ్యవాణి ఆతర్వాత సర్ధార్ కృష్ణమ నాయుడు మూవీలో సూపర్ స్టార్ కృష్ణ చెల్లెలుగా నటించి, పాపులర్ అయింది. ఆ మధ్య శ్రీకాంత్ , స్నేహ నటించిన రాధాగోపాళం మూవీలో కమెడియన్ వేణుమాధవ్ భార్యగా నటించింది.
ఆ సినిమాలో భారీకాయంతో కనిపించటంతో దివ్యవాణి ఇలా అయిందేమిటి అని అందరూ అనుకున్నారు. ఈమె తెలుగు,తమిళ,మలయాళం,కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్యవాణి పెళ్లి పుస్తకం సినిమాలో బాపు బొమ్మలా ఒదిగిపోయి, మంచి విజయాన్ని అందుకుంది.
దాంతో స్టార్ హోదా వచ్చేసింది. ఇంతకీ ఈమె అసలు పేరు ఉష. టెన్త్ వరకూ చదువుకుంది. ఈమెది గుంటూరు జిల్లా తెనాలి. అయితే ఊర్వశి శారద, దివ్యవాణి ల ఊరు ఒకేటే కావడం, ఇద్దరి ఫ్యామిలీస్ మధ్య అనుబంధం ఉండడంతో సినిమాల్లోకి వస్తే నటిగా సక్సెస్ కొడతావని శారద ఎంకరేజ్ చేశారట.
అంతేకాదు, మద్రాసు తీసుకెళ్లి రచయిత పరుచూరి గోపాలకృష్ణకు పరిచయం చేసి, మేకప్ స్టిల్స్ కూడా తీయించారట శారద. కె ఎస్ ఆర్ దాస్ డైరెక్షన్ లో అడవిలో అర్ధరాత్రి మూవీకి సెలక్ట్ అయినప్పుడు ఈమె పేరును స్వాతిగా మార్చరట. అదే పేరుతొ సర్ధార్ కృష్ణమనాయుడు,లాయర్ భారతీదేవి మూవీస్ లో చేసింది. అయితే పెళ్లి పుస్తకం మూవీతో దివ్యవాణి గా అవతారం ఎత్తడమే కాదు, కెరీర్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం సినిమాల్లో తగ్గినప్పటికీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటోంది. టిడిపి లో కీలక పాత్ర పోషిస్తోంది.