మనసు మమత సీరియల్ చైల్డ్ ఆర్టిస్టు పింకీ రియల్ లైఫ్
Manasu mamatha serial child artist pinky : వివిధ ఛానల్స్ లో వస్తున్న సీరియల్స్ కి ఆడియన్స్ లో మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే పోటాపోటీగా సీరియల్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే మనసు మమత సీరియల్ లో నటీనటులు తమ అందంతో,నటనతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నారు. అందుకే ఈ సీరియల్ బాగా ఫేమస్ అయింది.
ధారావాహికంగా నడుస్తున్న ఈ సీరియల్ లో నటిస్తున్న నటీనటులకు మంచి గుర్తింపు లభించింది. ఇక మనస్సు మమత సీరియల్ లో రాజశేఖర్ కి కూతురుగా నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్టు పింకీ తన అందంతో నటనతో ఆకట్టుకుంటోంది. పింకీ అసలు గ్రీష్మ. ఏప్రియల్ 13న జన్మించింది. ఈమెకు నాని అనే ఒక బ్రదర్ ఉన్నాడు. యితడు కూడా ఆర్టిస్టు.
గ్రీష్మకు చిన్న నాటి నుంచి యాక్టింగ్,డాన్స్ అంటే ఇష్టం. అందుకే పేరెంట్స్ ఎంకరేజ్ మెంట్ తో చైల్డ్ ఆర్టిస్టుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి,అభిలాష, అష్టాచెమ్మా,బంధం,ఒట్టు ఇది నా పెళ్ళాం కాదు వంటి సీరియల్స్ లో నటించి, తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు మనసు మమత సీరియల్ తో మంచి పాపులార్టీ తెచ్చుకుంది.