MoviesTollywood news in telugu

వేటగాడు మూవీ సమయంలో వచ్చిన సినిమాల పరిస్థితి…?

NTR vetagadu movie :దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో నటరత్న ఎన్టీఆర్,శ్రీదేవి జంటగా నటించిన వేటగాడు మూవీ అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. 1979జులై 5న రిలీజయింది. జంధ్యాల కథ సమకూర్చిన ఈ సినిమా 24సెంటర్స్ లో డైరెక్ట్ 100డేస్,3సెంటర్స్ లో 365రోజులు ఆడింది. ఇక జులై 12న సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎవడబ్బ సొమ్ము మూవీ రిలీజయింది. మొదటి వారంలో మంచి కలెక్షన్స్ రాబట్టింది. కె ఎస్ ఆర్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వేటగాడు ప్రభంజనం ముందు హవా సాగించలేక,ప్లాప్ గా మిగిలింది.

వేటగాడు మూవీకి రెండు వారాల ముందుగా మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా పునాదిరాళ్ళు రిలీజయింది. నరసింహరాజు ప్రధాన పాత్ర పోషించగా, అతడి ఫ్రెండ్ గా చిరంజీవి నటించాడు. అయితే డాన్స్ సీన్ తో చిరంజీవి ఎంట్రన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. గుడిపాటి రాజ్ కుమార్ డైరెక్టర్ గా వ్యవహరించారు. బాక్సాఫీస్ దగ్గర మంచి మూవీగా మిగిలింది.

జయసుధ ప్రధాన పాత్రగా తెరకెక్కిన ఇది కథ కాదు మూవీలో చిరంజీవి కూడా నటించినప్పటికీ నెగెటివ్ షేడ్ రోల్ చేసాడు. వేటగాడు మూవీకి 8రోజుల ముందు రిలీజైన ఈ మూవీలో కమల్ హాసన్ కీలక పాత్ర చేసాడు. కె బాలచందర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఓ మోస్తరు గా ఆడింది. రజనీకాంత్ హీరోగా నటించిన ధర్మయుద్ధం మూవీలో శ్రీదేవి హీరోయిన్. వేటగాడుకి 6డేస్ ముందు రిలీజయింది.శక్తి డైరెక్ట్ చేసిన తమిళ మూవీని తెలుగులో డబ్ చేసారు. వేటగాడు మొదటి స్థానంలో నిలవగా,పునాదిరాళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉంది.