కార్తీక దీపం సీరియల్ నటి జ్యోతి రెడ్డి భర్త ఎవరో తెలుసా?
Karthika Deepam Serial Actress Jyothi Reddy : బుల్లితెరమీద టాప్ సీరియల్ గా నడుస్తున్న కార్తీకదీపం సీరియల్ లో ఎసిపి రోషిణి పాత్రలో నటి జ్యోతి రెడ్డి దుమ్మురేపుతోంది. ఈమె అద్భుత నటనకు ఆడియన్స్ నుంచి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె పలు సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న ఈమె పలు ఛానల్స్ లోని సీరియల్స్ లో చేస్తోంది.
జ్యోతిరెడ్డి 1983 ఆగస్టు 4న హైదరాబాద్ లో జన్మించింది. ఈమె తండ్రి బి ఎస్ ఎన్ ఎల్ లో పనిచేస్తారు. భాగ్యనగరంలోని ఉంటున్న ఈమెకు పెళ్లయింది. ఆమె భర్త ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు. యస్వంత్,అభిరాం అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దబ్బాయి మలేషియాలో హోటల్ మేనేజ్ మెంట్ చేస్తున్నాడు. చిన్నబ్బాయి 6వ తరగతి చదువుతున్నాడు. జ్యోతిరెడ్డికి చిన్నప్పటి నుంచి డాన్స్,యాక్టింగ్ అంటే ఇష్టం ఉండడంతో డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఎన్నో స్టేజ్ షోస్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. తల్లి ఎంకరేజ్ మెంట్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి 30ఏళ్ళు అవుతోంది. తనకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉండడం వలన ఇండస్ట్రీలో ఉన్నానని జ్యోతిరెడ్డి చెప్పే మాట. తెలుగు, తమిళ సీరియల్స్ లో నటించిన జ్యోతిరెడ్డి 2వేలకు పైగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఎన్నో పురస్కారాలు అందుకున్న ఈమె రక్తసంబంధం, ప్రేమ ఎంత మధురం వంటి ఎన్నో సిరియల్స్ లో నటించింది.