టక్ జగదీష్ సినిమాని వెంటాడుతున్న సెంటిమెంట్…ఎలా నెగ్గుకువస్తాడో…?
Nani tuck jagaadish : నేచురల్ స్టార్ నాని వరుస విజయాలను అందుకుని, ఆతరవాత కొన్ని ప్లాప్ లు చూసాడు. ఈలోగా కరోనా వచ్చి పడింది. దీంతో థియేటర్లు మూతపడడం,కొన్ని సినిమాలు పూర్తయినా రిలీజ్ కి నోచుకోని విధానం నేపథ్యంలో నెగెటివ్ షేడ్ లో నటించిన వి మూవీ ఓటిటి లో రిలీజయింది.
అయితే వి సినిమా ఘోరంగా నిరాశపరిచింది. ఈలోగా షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించిన టక్ జగదీశ్ రిలీజ్ చేయాలని భావించారు. మళ్ళీ సెకండ్ వేవ్ ముంచుకు రావడంతో థియేటర్లు మూతపడి మొన్ననే తెరుచుకున్నాయి. అయితే పెద్ద సినిమాలు ఇంకా థియేటర్లలో పడడం లేదు.
ఈ నేపథ్యంలో టక్ జగదీశ్ ఓటిటి మీద రిలీజ్ చేయడానికి ఒకే చెప్పాల్సి వచ్చిందని టాక్. తీరువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ కి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీని ఓటిటిలో రిలీజ్ చేయడానికి నాని ఒప్పుకోక తప్పలేదు. పాపం ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తోందో.
టక్ జగదీష్ సినిమాను నిర్మాతలు వారికి ఉన్న ఇబ్బందుల దృష్ట్యా OTT లో విడుదల చేయటానికి సిద్దం అయ్యారు. అయితే నాని వి సినిమా అనుభవంతో ott వైపుకి వెళ్లకూడదని భావించాడు. కానీ అటు వైపుకి వెళ్ళాక తప్పలేదు. దాంతో కాస్త నాని సినిమా పలితంపై కాస్త కంగారుగా ఉన్నాడు.