సల్మాన్ ఖాన్ తొలి సినిమా పారితోషకం ఎంతో తెలుసా ?
Salman khan first movie remuneration :బాలీవుడ్ లో 100కోట్ల పారితోషికం అందుకుంటున్న సల్మాన్ ఖాన్ సినిమాకు కలెక్షన్లు కూడా అలాగే ఉంటాయి. బివి హొతో హౌసీ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ ఆ మూవీ నిరాశ పరిచినా, తర్వాత నుంచి ముందుకు దూసుకెళ్లాడు. ఎందుకంటే మై నే ప్యార్ కియా మూవీ అద్భుత విజయాన్ని అందించింది.
ఈ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరో గా మారిన సల్మాన్ ఇక వెనుదిరిగి చూడలేదు. వరుస విజయాలతో విశేష సంఖ్యలో ఫాన్స్ ని సొంతం చేసుకున్నాడు. లాక్ డౌన్ కి ముందు కూడా మూడు సినిమాలు రిలీజయ్యాయి. కరోనా మొదటి వేవ్ తర్వాత మరో సినిమా కూడా విడుదలయింది.
అంతిం ది ఫైనల్ ట్రూత్ అనే మూవీలో ప్రస్తుతం నటిస్తున్న సల్మాన్ తాజాగా అమీర్ ఖాన్ నటించే లాల్ సింగ్ చద్దాలో గెస్ట్ రోల్ కి కూడా ఒకే చెప్పాడు. విదేశాల్లో కూడా లక్షల సంఖ్యలో ఫాన్స్ ని కలిగి ఉన్న సల్మాన్ మొదటి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం 11వేలు. అయితే తొలి సినిమాలో చిన్న పాత్రకు పరిమితం అయ్యాడు.